దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు(Gold Prices India) ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రాబోయే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అంచనాలు ధరలను కొద్దిగా ప్రభావితం చేశాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,500గా ఉంది. స్పాట్ మార్కెట్(Market)లో కిలో వెండి ధర రూ.1,91,000గా నమోదైంది. బుధవారం పోలిస్తే ధరల్లో వచ్చిన మార్పు తక్కువగానే ఉంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ధర 0.05% తగ్గి రూ.1,30,421 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. వెండి ధర 0.03% పెరిగి కిలోకు రూ.1,82,408 చేరింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,30,360 నుంచి రూ.1,30,510 మధ్య కొనసాగుతున్నాయి. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,19,500 నుండి రూ.1,19,650 మధ్య ఉన్నాయి.
Latest News: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,30,510 కాగా, హైదరాబాద్‌లో అదే క్యారెట్ బంగారం రూ.1,30,360గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,580 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,700 వద్ద ఉంది. స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ.1,91,000 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై
- 24 క్యారెట్లు: రూ. 13,113
- 22 క్యారెట్లు: రూ. 12,020
- 18 క్యారెట్లు: రూ. 10,025
ముంబై
- 24 క్యారెట్లు: రూ. 13,036
- 22 క్యారెట్లు: రూ. 11,950
- 18 క్యారెట్లు: రూ. 9,778
ఢిల్లీ
- 24 క్యారెట్లు: రూ. 13,051
- 22 క్యారెట్లు: రూ. 11,965
- 18 క్యారెట్లు: రూ. 9,793
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: