ప్రస్తుతం వరుసగా మూడో రోజూ భారీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సిబ్బంది కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి కీలక నగరాల్లో ఇండిగో (Indigo) కార్యకలాపాలు దాదాపు స్థగించిపోయాయి. గురువారం ఉదయం మాత్రమే ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కు పైగా విమానాలు నిలిపివేయబడ్డాయి. హైదరాబాద్‌లో కూడా సుమారు 33 సర్వీసులు రద్దయ్యాయి. నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 170కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదే విధంగా నిన్న కూడా ప్రధాన నగరాల్లో దాదాపు 200 సర్వీసులు నిలిచిపోయాయి.
Read also: Currency: రూపాయి చరిత్రలో కొత్త కనిష్ఠం: డాలర్ 90 కు చేరింది

Difficulties for Indigo flights
అకస్మాత్తుగా ఎదురైన ఆపరేషనల్
ఇటీవల వచ్చిన సమస్యలపై ఇండిగో స్పందిస్తూ, అకస్మాత్తుగా ఎదురైన ఆపరేషనల్ సవాళ్లు, యంత్రాల్లో సాంకేతిక లోపాలు, శీతాకాల షెడ్యూళ్ల మార్పులు, అలాగే సిబ్బంది డ్యూటీ రోస్టర్‌కు సంబంధించిన కొత్త FDTL నిబంధనలు తమ కార్యకలాపాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ప్రకటించింది. పరిస్థితిని నియంత్రించేందుకు వచ్చే రెండు రోజుల్లో షెడ్యూళ్లను సవరించి సేవలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. విమానాల రద్దుపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ జోక్యం చేసుకుంది. ఇండిగో రద్దు చేసిన సర్వీసుల వివరాలు, కారణాలు, ప్రయాణికులకు అందిస్తున్న ప్రత్యామ్నాయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై స్పష్టత కోసం సంస్థ ఉన్నతాధికారులను సమావేశానికి పిలిచింది.
48 గంటల విశ్రాంతి తప్పనిసరి
డీజీసీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవంబర్ నెలలో ఇండిగో మొత్తం 1,232 విమానాలను రద్దు చేసింది. వీటిలో 755 విమానాలు సిబ్బంది కొరత మరియు కొత్త FDTL నిబంధనల వల్లే రద్దయినట్లు వెల్లడించింది. దాంతో అక్టోబర్‌లో 84.1 శాతం ఉన్న ఇండిగో ఆన్-టైమ్ పనితీరు నవంబర్‌లో 67.7 శాతానికి పడిపోయింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డ్యూటీ నిబంధనల్లో పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేయడం, రాత్రి సమయంలో ల్యాండింగ్‌లను పరిమితం చేయడం వంటి నియమాలు ఈ సంక్షోభానికి దారితీశాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: