పోషకాహార లోపాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం(TG) అంగన్‌వాడీ సేవల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి శిశువులు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను పూర్తిగా నిర్మూలించాలన్న దీర్ఘకాల లక్ష్యంతో ఈ కొత్త కార్యక్రమం రూపొందింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు బెల్లం ఆధారంగా పల్లీ చిక్కీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవి శక్తిని, ప్రోటీన్‌ను, మరియు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రక్తహీనత, ఎదుగుదల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆకర్షణీయమైన మరియు ఆరోగ్యకరమైన ఈ చిరుతిండి అందుబాటులో ఉండటం వల్ల హాజరు శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read also: అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు..

నిపుణుల సిఫార్సులతో కార్యాచరణ ముందుకు
ఇటీవల శిశు సంక్షేమశాఖ(TG) ఆధ్వర్యంలో వైద్యులు, పోషకాహార నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం జరిగింది. పల్లీలు, బెల్లం, నువ్వులు వంటి పదార్థాలు పిల్లల శారీరక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయని వారు వివరించారు. ఈ అభిప్రాయాల ఆధారంగా ప్రతి చిన్నారికి రోజుకు ఒక పల్లీ చిక్కీ అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనకు పంపింది. ఆమోదం లభించిన తరువాత, రాష్ట్రంలోని 60,000కు పైగా అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చిక్కీల తయారిని చేపట్టడం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: