రాబోయే సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026), సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
Read Also: IND Vs SA T20 series: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్
టీమిండియా రైజింగ్ స్టార్ తిలక్ వర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత జట్టుకు ఎల్లప్పుడు నా శుభాకాంక్షలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ భారత జట్టుకు మద్దతు ఇస్తారు. జట్టు కప్‌ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్ చెప్పాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) ప్రారంభం కానుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: