పశ్చిమ దేశాలలోని వలస వ్యతిరేక విధానాలపై విదేశాంగ (Pak Minister) మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలను తప్పుబట్టారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆయా దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని, వారే నష్టపోతారని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో వారే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read Also: Afghanistan: హంతకుడిని వేలప్రజల మధ్య కాల్చి చంపించిన తాలిబన్లు

ప్రతిభా ప్రవాహానికి అడ్డంకులు ఏర్పరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలకు, ఆయా దేశాల్లోని సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వలసలకు సంబంధించి అమెరికా, ఐరోపా దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమే అన్నారు.
వలసల వల్ల రెండు దేశాలకు ప్రయోజనమే
గత రెండు దశాబ్దాలలో ఉద్దేశపూర్వకంగా, అన్నీ తెలిసే తమ వ్యాపారాలను వ్యూహాత్మకంగా విదేశాలకు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ సమస్యకు స్వయంగా వారే పరిష్కార మార్గాలు చూపించాలని అన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ప్రవాహం ఇరు దేశాలకు ప్రయోజనకరమని వారు గుర్తించాలని జై శంకర్ అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: