భారత్, సౌతాఫ్రికా (IND vs SA 2nd ODI) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు టాస్ కలిసి రాలేదు. కెప్టెన్ వరుసగా 20వ సారి టాస్‌ను కోల్పోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ (IND vs SA 2nd ODI) కు దిగింది. తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
Read Also: IND vs SA 2nd ODI: రెండవ వన్డే.. టాస్ ఓడిన భారత్
కోహ్లీ హాఫ్ సెంచరీ
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్, యశస్వి (22)ల వికెట్లు త్వరగా కోల్పోవడంతో కాస్త నిరాశ ఎదురైంది. అయితే, మూడో వికెట్‌కు క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.
గైక్వాడ్ 52 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 50 రన్స్ స్కోరు చేయగా, 47 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.గైక్వాడ్, కోహ్లీ.. మూడో వికెట్‌కు అజేయంగా వంద రన్స్ పైగా జోడించారు.తాజా సమాచారం ప్రకారం ఇండియా 27 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: