हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay: చెన్నై వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విజయ్

Anusha
Latest News: Vijay: చెన్నై వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విజయ్

తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వాటి కారణంగా ఏర్పడిన జలమయం పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన జలమయానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Read Also: Seed bill : విత్తన బిల్లు ఎవరి కోసం?

కాలువల ప్రాజెక్టుల కోసం నిధులు

డీఎంకే ప్రభుత్వం (DMK Govt) నాలుగన్నరేళ్లుగా డ్రైనేజీ పనులను అసంపూర్తిగా, అసమర్థంగా చేపట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి.

ఈ కష్టాలకు అసలు కారణం.. ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా, పూర్తిగా నిర్మించకపోవడమే. ప్రజలపై ప్రభుత్వానికి కొంచెం శ్రద్ధ ఉన్నా, కొద్దిరోజుల వర్షానికే నగరం ఇలా నీట మునిగేది కాదు” అని విజయ్ పేర్కొన్నారు. వర్షపు నీటి కాలువల ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించినప్పటికీ, ప్రభుత్వం ఫలితాలు చూపడంలో విఫలమైందని ఆరోపించారు.

Vijay blames government failure for Chennai floods

అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి

ప్రజలందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసిన విజయ్ (Vijay), వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని తన పార్టీ కార్యకర్తలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలగకుండా,

వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన (Vijay) డిమాండ్ చేశారు. అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల అనేక ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.  

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870