స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC Notification) 25,487 కానిస్టేబుల్ (GD Constable) మరియు రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) మరియు అస్సాం రైఫిల్స్ (AR) వంటి వివిధ బలగాలలో ఉన్నాయి. అభ్యర్థులు డిసెంబర్ 31, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
- CISF: 14,595
- CRPF: 5,490
- SSB: 1,764
- AR: 1,706
- ITBP: 1,293
- BSF: 616
- SSF: 23
Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఈ పోస్టులకు(SSC Notification) దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగి, 2026 జనవరి 1 నాటికి లేదా అంతకు ముందు ఉత్తీర్ణులు కావాలి. వయో పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంది.
అభ్యర్థుల ఎంపిక:
పోస్టులు ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), వైద్య పరీక్ష (DME/RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) తదితర పరీక్షలు ఉంటాయి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు అందుతాయి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 1, 2025
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31, 2025
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 1, 2026
- రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి – ఏప్రిల్ 2026 మధ్య
వెబ్సైట్: ssc.gov.in
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: