మండుపడుతున్న బీజేపీ నేతలు అందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) రేపు (గురువారం) భారత్ పర్యటనకు రానున్నారు. రెండురోజుల పాటు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఇందుకోసం భారత్ ఏర్పాట్లు చేస్తోంది. పుతిన్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
Read Also: Russia: భారత్ లో పర్యటించనున్న పుతిన్.. కీలక ఒప్పందంపై రష్యా ఆమోదం!
తగ్గట్టుగా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టి, మరీ వార్తల్ని ప్రసారం చేస్తున్నది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.

బీజేపీ తీవ్ర ఆగ్రహం
పుతిన్ కోసం భారత్ రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసింది. అయితే రెడ్ కార్పెట్ పై ప్రధాని మోదీ టీ (Chaiwala) అమ్ముతున్నట్లుగా ఏఐ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీని (Prime Minister Modi) కాంగ్రెస్ మరోసారి అగౌరవపరిచిందని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ పోప్ చేశారు. ‘ఇప్పుడు ఇది ఎవరు చేస్తారు?’ అంటూ క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేశారు.
బీహార్ ఎన్నికల్లోనూ ఇదేరకం వీడియో
ఇక వీడియోలో ప్రధాని మోడీ లేత నీలం రంగు కోటు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నారు. కెటిల్, టీ గ్లాసులు చేత్తో పట్టుకుని రెడ్ కార్పెట్ పై పిలుస్తున్నట్లుగా కనిపించారు. అంతర్జాతీయ జెండాలు, త్రివర్ణ పతాకం వీడియోలో కనిపించింది. మోదీ చాయ్ బోలో.. చాయ్యే (ఎవరికైనా టీ కావాలా’ అంటూ మోడీ అరుస్తున్నట్లుగా గొంతు వినబడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల
సమయంలో కూడా ఇదే తరహాలో మోడీపై ఏఐ వీడియో క్రియేట్ చేసింది. పెద్ద ఎత్తున ఓట్ల చోరీ చేసుకొచ్చానని వీడియోలో కనిపించింది. అప్పట్లో ఈ వీడియో తీవ్ర దుమారం రేగింది. తాజాగా పుతిన్ భారత్ కు వస్తున్న సమయంలో అదే తరహాలో కాంగ్రెస్ ఏఐ వీడియో విడుదల చేయడంపై కమలనాథులు మండిపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: