శబరిమల(Special Trains) యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. డిసెంబర్ 13 నుంచి జనవరి 2 వరకు జోన్ పరిధిలోని మూడు ప్రధాన స్టేషన్ల నుండి కొల్లం జంక్షన్‌కి మొత్తం 10 ప్రత్యేక రైళ్లు నడపబడతాయి. ఈ ప్రత్యేక రైళ్ల కోసం టికెట్ల బుకింగ్ డిసెంబర్ 3 (నేడు) నుండి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
Read also: నెట్టింట వైరల్ అవుతున్న సమంత కొత్త ఫ్యామిలీ ఫొటో

రైలు మార్గాలు, ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్
సిర్పూర్–కొల్లం ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07117) డిసెంబర్ 13న ప్రారంభమై, విజయవాడ, తిరుపతి(Special Trains) వంటి స్టేషన్ల ద్వారా కొల్లం చేరుతుంది. చర్లపల్లి–కొల్లం ప్రత్యేక రైళ్లు (07119, 07121) డిసెంబర్ 17, 20, 31న ప్రయాణిస్తాయి. హజూర్‌సాహిబ్ నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలు (07123) డిసెంబర్ 24న ప్రారంభమై, నిజామాబాద్, కరీంనగర్, విజయవాడ, తిరుపతి వంటి స్టేషన్లలో ఆగుతుంది. తిరిగి కొల్లం నుంచి చర్లపల్లికి వచ్చే రైళ్లు డిసెంబర్ 15, 19, 22, 26, జనవరి 2న అందుబాటులో ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) అధికారులు ఈ ప్రత్యేక రైళ్లు భక్తులకు సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: