వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి ప్రవేశించే మార్గంలో ఉన్న బారికేడ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది రాష్ట్ర సచివాలయమా? లేక కమర్షియల్ కాంప్లెక్సా?” అని ఆయన అధికారులను ప్రశ్నించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు(Barriers) ఏర్పాటు చేసినందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో, అధికారులు వెంటనే వాటిని తొలగించారు.
Read Also: AP Schools: ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయానికి వస్తున్నప్పుడు, పోలీసులు ప్రధాన రహదారిపై వాహనాలు, ప్రజలు రాకుండా బారికేడ్లు పెట్టారు. వీటిని గమనించిన ముఖ్యమంత్రి అక్కడికక్కడే అసహనం వ్యక్తం చేశారు. “కేవలం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మాత్రమే బారికేడ్లు అవసరమని, రహదారిని పూర్తిగా మూసివేయడం సరికాదని” ఆయన అధికారులతో చర్చించారు.
ఆర్టీజీఎస్ సమావేశం
ఈ అంశం గురించి ఆర్టీజీఎస్ సమావేశంలో కూడా ఆయన మాట్లాడారు. “పింఛన్ల పంపిణీ కోసం గ్రామాలలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ సచివాలయంలో వున్న ఏర్పాట్ల కంటే మరింత సౌకర్యవంతమైనవి,” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు సచివాలయానికి వచ్చే సమయంలో సౌకర్యవంతమైన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో, అధికారులు వెంటనే సచివాలయ ఆవరణలోని బారికేడ్లను తొలగించి, వాటి స్థానంలో అందమైన పూలకుండీలను ఏర్పాటు చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: