నగరంలోని ప్రముఖ హోటళ్లు(HYD Hotels)గా గుర్తింపు పొందిన ఉడ్ బ్రిడ్జ్ సహా మరో రెండింటి పై మంగళవారం ఐటి దాడులు జరిగాయి. గత నెల 18, 19వ తేదీల్లో పిస్తా హౌస్(pista house), షాగౌస్, మెహఫిల్ల(mehfil) పై రెండు రోజులపాటు ఐటి సోదాలు జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూడు హోటళ్ల యాజమాన్యాలు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఐటి అధికారులు నిర్దారించడం విదితమే. అప్పటి దాడుల సందర్భంగా వెల్లడైన పత్రాలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా మంగళవారం నాడు ఉడ్ బ్రిడ్జో(Wood Bridge) పాటు మరో రెండు హోటళ్లపై ఐటి అధికారులు 20 బృందాలతో కేంద్ర బలగాల పహారా మధ్య సోదాలు నిర్వహించారు.
Read Also: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్

కేరాఫ్గా నిలిచిన హోటళ్లు పన్ను
ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. బిర్యానీకి కేరాఫ్గా నిలిచిన హోటళ్లు పన్ను(income tax) ఎగవేతకు పాల్పడినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించి దాడులకు దిగినట్లు సమాచారం. ప్రతీ యేటా వందల కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ హోటళ్లు(HYD Hotels) ఆ స్థాయిలో పన్నులను చెల్లించడం లేదని ఐటి అధికారులకు సమాచారం అందడంతో దీని ఆధారంగా దాడులు జరిగినట్లు తెలిసింది. ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కేంద్ర బలగాలతో ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ హోటళ్లకు జంట నగరాలతోపాటు శివార్లలో, ఆఖరుకు విదేశాల్లోనూ బ్రాంచీలు వుండడంతో ఐటి అధికారులు ప్రధాన శాఖతో పాటు ఆయా ప్రాంతాలలోని బ్రాంచీలలో సోదాలు చేబట్టారు. హోటళ్ల ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లు, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. ఉడ్ బ్రిడ్జ్ హోటల్ నిర్వాహకుడు హర్షద్ అలీఖాన్ను ఐటి అధికారులు విచారించారు. సోదాల సందర్భంగా అక్కడ వున్న లెక్కలు, వాస్తవంలో వుండాల్సిన దాంట్లో భారీగా తేడాలున్నట్లు ఐటి అధికారులు గుర్తించారని తెలిసింది. భారీగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: