టెక్నికల్ స్కిల్స్‌లో అసాధారణ ప్రతిభ చూపిన iBomma Ravi (Emmadi Ravi) గురించి విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పైరసీ ద్వారా కొత్త సినిమాలను దొంగిలించి అప్లోడ్ చేయడంలో రవికి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన పోలీసులు, అతనికి సైబర్ క్రైమ్(Cybercrime) విభాగంలో ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. మంచి జీతంతో ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చినా, రవి మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Read Also: iBOMMA: రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

విచారణలో సంచలన వివరాలు
కస్టడీలో రవిని ప్రశ్నించిన పోలీసులు, అతడి భవిష్యత్ ప్రణాళికలను అడిగినప్పుడు అతను ఏ మాత్రం ఆలోచించకుండా తన కలలను వివరించాడు. iBomma మూసుకుపోయిన తరువాత కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్‌ను ప్రారంభించాలనే ఆలోచన తనదేనని రవి తెలిపినట్లు తెలుస్తోంది. ఆ రెస్టారెంట్‌కు కూడా ‘iBomma’ అనే పేరే పెట్టాలని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. రవి ప్రకారం, అక్కడి ప్రజలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు భారతీయ వంటకాలను పరిచయం చేసి డబ్బు సంపాదించాలని భావిస్తున్నాడు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా iBomma రెస్టారెంట్ల శ్రేణిని ప్రారంభించాలని కూడా అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
విలాసవంతమైన జీవితం లక్ష్యం
పైరసీ ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని రవి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు సంపాదించిన రూ.20 కోట్లలో రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 80 లక్షల రూపాయలతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం కూడా రవి పొందాడు. ఇకపై కూడా వారానికి ఒక దేశం తిరుగుతూ, తనకు నచ్చినట్లు జీవించాలని అతను తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా రవి ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లు, అలాగే హైదరాబాద్‌లోని ఫ్లాట్ మరియు విశాఖపట్నంలోని ఆస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే రవికి బెయిల్ కూడా వచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: