తెలంగాణ (TG High Court) రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తాజాగా విడుదల చేసింది. మొత్తం 66 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం డిసెంబర్ 8 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 29వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు (TG High Court) పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 29న రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read Also: Raj Bhavan renamed : రాజ్ భవన్‌కు కొత్త పేరు | తెలంగాణలో ఇకపై ‘లోక్ భవన్’…

పూర్తి వివరాలు
ఈ పోస్టులకు సంబంధించిన నియామక పరీక్ష తేదీలు, సమయం, హాల్‌టికెట్ల డౌన్లోడ్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే హైకోర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలను (TG High Court Website) వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ గారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: