గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా రెండో వన్డే మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. రెండో వన్డే మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న సమయంలో తాను ఇంకా పాఠశాలలో చదువుకుంటున్నానని గుర్తు చేసుకున్నాడు.
Read Also: IND vs SA: దక్షిణాఫ్రికాతో నేడే రెండో వన్డే

చాలా మ్యాచ్‌లు ఆడాము
తొలి వన్డేకు దూరమైన బవుమా (Temba Bavuma) , రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బవుమా మాట్లాడుతూ..రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు మరింత బలోపేతమైందని అంగీకరించాడు. అయితే, వారిని ఎదుర్కోవడం తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశాడు.
కోహ్లీ, రోహిత్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, అయినా వారితో తాము చాలా మ్యాచ్‌లు ఆడామని తెలిపారు. కొన్నిసార్లు తాము పైచేయి సాధించామన్నారు. ఈ సవాళ్లు సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా మారుస్తాయని బవుమా వివరించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: