కేవలం 19 ఏళ్ల వయసులోనే(Kashi) వేద పఠనంలో అరుదైన ఘనత సాధించిన దేవవ్రత్ మహేశ్ రేఖే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. శుక్ల యజుర్వేదంలోని మాధ్యందినీ శాఖకు చెందిన దండక్రమ పారాయణం సుమారు 2,000 మంద్రములతో కూడిన ఈ అత్యంత క్లిష్టమైన పఠనాన్ని పుస్తకం ఆశ్రయం లేకుండా, కేవలం 50 రోజుల్లో పూర్తి చేశాడు. దీన్ని దేశ సంస్కృతికి ప్రతీకగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ,(Narendra Modi) రేఖే సాధన రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. పవిత్రమైన కాశీ నగరంలో ఈ అరుదైన పఠనం పూర్తి కావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
Read also: శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

కాశీ సాక్షిగా వెలిగిన యువకుని ప్రతిభ
దండక్రమం వేద పఠనంలోని(Kashi) అత్యంత కఠినమైన రూపాలలో ఒకటి. మంత్రాల ఉచ్చారణ, స్వరాలు, విరామాలు, క్రమం శాస్త్రీయ పద్ధతిలో పాటించాల్సిన ఈ పారాయణాన్ని యువకుడు తప్పులేకుండా పూర్తి చేయడం పెద్ద సాహసమే. గురుభక్తి, అనేక గంటల సాధన, అంకితభావం లేకుండా ఇది సాధ్యం కాదని వేదపండితులు అభినందిస్తున్నారు. వేదసంప్రదాయ పునరుజ్జీవనంలో యువత చూపుతున్న ఆసక్తికి దేవవ్రత్ ఉదాహరణ అని పండితులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘనతపై ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. భారతీయ జ్ఞానపారంపర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇలాంటి ప్రతిభలు ఎంతో దోహదపడతాయని విశేషంగా చెప్పబడుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: