మీ ట్రైన్ ప్రయాణంలో సమస్యలు ఎదురైనప్పుడు, మీరు పూర్తి టికెట్(Train Tickets) రీఫండ్ పొందవచ్చు. సమస్యలలో ఇలా ఉండవచ్చు:
- రైలు మూడు గంటలకు మించి ఆలస్యమైంది
- క్యాన్సిల్ అయింది
- దారి మార్చబడింది
- బుక్ చేసిన క్లాస్ అందుబాటులో లేదు
- ఏసీ లేదా ఇతర సౌకర్యాలు పనిచేయడం లేదు
Read also: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు

ఈ పరిస్థితులలో టీడీఆర్ (Ticket Deposit Receipt) ఫైల్ చేసి డబ్బు తిరిగి పొందవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా టీడీఆర్ ఫైల్ చేయడం
- IRCTC వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వండి
- My Account > My Transactions లోకి వెళ్లి File TDR ఆప్షన్ ఎంచుకోండి
- మీ PNR నంబర్ ఎంటర్ చేసి, సమస్యకు కారణాన్ని సెలెక్ట్ చేయండి
- ఫైల్ చేయనున్న ప్యాసింజర్ల సంఖ్య ఎంటర్ చేసి File TDR బటన్ క్లిక్ చేయండి
- సూచనలు చదివి, ఎస్ (Submit) బటన్ క్లిక్ చేయండి
- ఫైలింగ్ విజయవంతమయిందని మెసేజ్ డిస్ప్లే అవుతుంది
ఆఫ్‌లైన్ విధానం
రైల్వే స్టేషన్‌లోని టికెట్(Train Tickets) కౌంటర్‌లో చేరి, ఉద్యోగులను సంప్రదించి టీడీఆర్ ఫైల్ చేయించవచ్చు. తర్వాత డబ్బు తిరిగి లభిస్తుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: