हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Will you forgive me : నన్ను మన్నించవా..!

Abhinav
Will you forgive me : నన్ను మన్నించవా..!

సాయంత్రం ఆరున్నర.. ఆకాశం క్షణ క్షణానికి ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ చీకట్లు అలుముకుంటున్న వేళ.. నగరంలో అదో పేరొందిన పెద్ద కార్పొరేట్ పాఠశాల. స్కూల్ విశాలమైన ఆవరణలో బాస్కెట్బాల్ కోర్టులో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. డ్రిల్మాస్టర్ నుదుటికి పట్టిన చెమట్లను తుడుచుకుంటూ, గట్టి విజిల్ ఊదడంతో మైదానంలో ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా అలర్టయి ఇళ్లకు బయల్దేరడానికి సిద్ధమయ్యారు ఆ కుర్రాడు వంగి మాలేసి కట్టుకుని, పుస్తకాల బ్యాగ్ని భుజానికి తగిలించుకొని బయల్దేరుతూ ఒక్కసారి చుట్టూతా కలయచూశాడు.నా వంక చూడగానే నేను వేగంగా చేయి ఊపాను. నెమ్మదిగా తలొంచుకొని నా వంక అడుగులేస్తూ వస్తున్నాడు. అంతలో కొందరు కుర్రాళ్లు ఆప్యాయంగా అతని భుజాల్ని తడుతూ “కంగ్రాచ్యు లేషన్స్ అనురాగ్” అంటూ అభినందిస్తున్నారు.అందరికీ చిరునవ్వుతో “థాంక్స్ అంటూ వీడ్కోలు పలికి నా దగ్గరకొచ్చాడు.అనురాగ్ నా ఒక్కగానొక్క కొడుకు. నైంత్ క్లాస్. బాస్కెట్ బాల్ వాడి ఫేవరేట్ గేమ్.అందరూ వాడిని అభినందిస్తున్నారంటే బహుశా.. ఇవాళ వాళ్ల టీం గెలిచే ఉంటుంది. “మీ టీం గెలిచిందా?” దగ్గరికి రాగానే ఆతృతగా అడిగాను. “.. చివరి బాస్కెట్ నేను వేయడం వల్లే మా టీం గెలిచింది” అన్నాడు గర్వంగా. 

అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు “డాడ్… ఇవాళ కూడా మీరు నా ఆట చూడలేదా?” అన్నాడు. నా వంక అదోలా చూస్తూ. “సారీరా.. ఆఫీసు నుంచి వచ్చేసరికి ఇదిగో ఈ టైమయింది” అన్నాను తప్పు చేసిన దోషిలా. “హు.. మీరెప్పుడూ ఇంతే, నేను బాగా ఆడి గెలిచినప్పుడే ఆలస్యంగా వస్తారు” అన్నాడు ఉక్రోషంగా. “సారీరా…” అంటూ వెహికల్ స్టార్ చేశాను. పాపం.. వాడు బాగా హర్టయినట్లున్నాడు. ఇల్లు చేరేదాకా ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. నోరు విప్పడానికి నాకు భయమేసింది. ఈసారి ఆలస్యం కాకుండా చూసుకోవాలి అనుకుంటూ బండివేగాన్ని పెంచాను.

ఇంటికి చేరగానే వాడికిష్టమైన బ్రెడ్ టోస్ట్ చేసి, సాస్తో కలిపి ఇచ్చాను. వాడు ఆత్రంగా తినడాన్ని చూస్తుంటే అర్థమౌతోంది… వాడెంత ఆకలి మీదున్నాడోనన్న సంగతి.

“బాగా ఆకలేసినట్లుంది కదూ!” అన్నాను చిన్నగా నవ్వుతూ. బదులివ్వలేదు. నా వంక చూసి ఊరుకున్నాడు. టోస్ట్ తింటూనే మౌనంగా ఏదో ఆలోచిస్తున్నాడు.

రాత్రి భోజనం సమయంలో వాడు మూడీగా ఉన్నాడన్న సంగతి గ్రహించి మెల్లగా స్కూల్ విషయాలు అడిగాను. అడిగినదానికే ముక్తసరి జవాబులతో, నా కన్నా ముందే భోజనం ముగించి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లిపోయాడు వాడు. రాత్రి పది గంటలకు నెమ్మదిగా వాడి గది తలుపు తెరిచి చూశాను. 

అటు వైపుగా తిరిగి టేబుల్ ల్యాంప్ వెలుతుర్లో శ్రద్ధగా చదువుకుంటున్నాడు. వాడినలా చూస్తుంటే చాలా ముచ్చటేసింది నాకు. చదువు పట్ల వాడికున్న శ్రద్ధకు సంతోషం కలిగింది. వాడి ఏకాగ్రతకి భంగం కలిగిస్తూ “గుడ్ నైట్ అనురాగ్” అన్నాను. ఒక్కసారి ఉలికిపాటుగా వెనక్కి తిరిగి “సరే” నన్నట్లు తలూపాడు. అంతకన్నా మరేమీ మాట్లాడలేదు. నేను వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చాను. అక్కడ షెల్ప్ ఉన్న ఫొటో ఫ్రేమ్ లోంచి అందంగా నవ్వుతున్న ‘నిశిగంధ’. “నిశి”… ప్రయత్నంగా నా పెదాలు ఫొటోని రెండు చేతుల్లోకి చూస్తుంటే కళ్ల నుండి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి చేతి మీద, కళ్లు తుడుచుకుంటూ “మళ్లీ జీవితంలోకి తిరిగిరావాలి, కనీసం నాలో నేను గొణుక్కుంటుంటే వెనక నుండి ఏదో శబ్దం వినబడింది. మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసా?” అడిగాను తెలివిగా వాడితోనైనా టచ్లో ఉందేమోనన్న ఆశతో. “ఆ విషయం నేనే మిమ్మల్ని అడగాలి” అని, వెంటనే “అయినా మీరింకా మమ్మీని లవ్ చేస్తున్నారా డాడ్?” అని అడిగాడు అటు వైపు చూశాను, వాడు నన్నే గమనిస్తున్నాడు. అంతే.. దొరికిన దొంగలా ఫోటోని యథాస్థానంలో ఉంచేసి నా గదిలోకి దూ(పా)రిపోయాను. మనసంతా కల్లోలమయింది. 

మంచమీద వాలి, “నన్ను క్షమించు నిశీ..” అని పలవరిస్తూ ఏ అర్ధరాత్రో నిద్రలోకి జారుకున్నాను. ఆరోజు.. అనురాగ్ స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది. పేరెంట్-టీచర్ మీటింగ్కి హాజరు కావాలని దాని సారాంశం. ఇదివరకు వాడి చదువు, బాగోగులు అన్నీ నిశి చూసుకునేది. కానీ ఇప్పుడవన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది.

అనురాగ్ని తీసుకొని వాడి స్కూల్కి వెళ్లాను. స్కూల్ ఆవరణంగా స్టూడెంట్స్, పేరెంట్స్ ఉంది. కోలాహలంగా క్యాంపస్లో అడుగు పెట్టగానే ప్రిన్సిపాల్ ఎదురొచ్చి “కంగ్రాచ్యులేషన్స్ శ్రీనివాస్ గారు.. మీ అబ్బాయి అనురాగ్ టాప్ ర్యాంక్ సార్” అన్నాను ఆనందంగా. “మీ అబ్బాయి ఒక్క చదువులోనే కాదు, స్కూల్ డిబేట్స్ లో, క్విజ్లోనూ, ఎలక్యూషన్లో అబ్బాయే ఫస్టు. అంతేకాదు.. ఈ మధ్య జరిగిన ఇంటర్ స్కూల్ బాస్కెట్బాల్ చాంఫియన్షిప్ పోటీల్లో టీంని ముందుకు నడిపించి కప్ సాధించుకొచ్చాడు. అనురాగ్..” అని ప్రిన్సిపాల్ గర్వంగా చెప్పుకుంటూ పోతున్నారు.

వారి మాటలు వింటుంటే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే వాడి ఎదుగుల కోసం నేను చేసిందేమీ లేదు. దీనంతటికి కారణం ఇదివరకు వాడి తల్లి నిశి, ఇప్పుడు వాడి ప్రైవేట్ ట్యూటర్. అంతేతప్ప ఇందులో నేను చేసిందంటూ ఏమీలేదు.

ఆఫీసు పనులతో పాటు, ఇంటి బాధ్యతంతా నా పైనే పడడంతో * ఇక వాడి చదువు విషయంలో శ్రద్ధ తీసుకునే తీరిక, ఓపిక రెండూ నాకు లేకుండా పోయాయి. ఆలోచనల్లో పడి నేనేమీ మాట్లాడకపోయేసరికి నా ధోరణిని గమనించి ప్రిన్సిపాల్ ఆశ్చర్యంగా “ఇంతకీ మీరు అనురాగ్ ఫాదరే కదూ!” అన్నారు అనుమానంగా. “యస్..యస్.. మా అబ్బాయే అనురాగ్” అన్నాను తేరుకుని. “రియల్లీ యూ ఆర్ వెరీ లక్కీ పర్సన్, బికాజ్ యూ ఆర్ ఫాదరాఫ్ సచ్ ఎ స్టూడెంట్!” అభినందించాడు ప్రిన్సిపాల్. రిపోర్ట్ కార్డు తీసుకునేటప్పుడు క్లాస్ట్బచర్ కూడా చాలావుగా ప్రిన్సిపాల్ గారి మాటల్నే రిపీట్ చేసింది.? తిరిగి ఇంటికి వస్తున్నంతసేవు ప్రిన్సిపాల్, టీవర్ల పొగడ్తలే నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇంట్లో అడుగు పెడుతుండగా “నీ హార్డ్వేర్క్ నువ్వింతగా రాణిస్తావని నేనూహించలేదు.. కాంగ్రాట్స్ రా లోంచి పుత్రోత్సాహం ఉప్పొంగింది. కానీ, వారదేమీ పెద్దగా పట్టించుకోకుండా మౌనంగా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ముఖానికి ఏదో బుక్ అడ్డుగా పెట్టుకుని చదువుకుంటున్నాడు. సడెన్గా ఏదో గుర్తొచ్చినట్లు “లేవు ట్యూషన్ ఫీజు పే చేయాలి. డాడ్” అని గుర్తు చేశాడు. “అలాగే.. రేపు ఉదయం గుర్తు. చేయ్, ఇస్తాను. అలాగే మీ ట్యూటర్కి నీ రిపోర్ట్ కార్డు చూపించు” “ఒకే దాడ్..!” “ఆనూ! నువ్విలా ఫస్ట్ ర్యాంక్ సాధించావని తెలిస్తే మమ్మీ ఎంత హ్యాపీ ఫీలయ్యేదో!” అన్నాను నిశి గుర్తొచ్చి. 

“అవును డాడ్!” అన్నాడు వాడు. అలా అంటుంటే వాడి గొంతులో బాధని స్పష్టంగా గుర్తించగలిగాను. “మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసా?” అడిగాను తెలివిగా వాడితోనైనా టచ్ ఉందేమోనన్న ఆశతో. “ఆ విషయం నేనే మిమ్మల్ని అడగాలి” అని, వెంటనే “అయినా మీరింకా మమ్మీని లవ్ చేస్తున్నారా డాడ్?” అని అడిగాడు. సడెన్గా వాడలా అడిగేసరికి ఏం చెప్పాలో ఒక్క క్షణం అర్ధంకాక అప్రయత్నంగానే “అవును” అన్నాను. వెంటనే వాడు “మమ్మీ కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది డాడ్…”అన్నాడు ఉద్వేంగా. “అవునా? నీకెలా తెలుసు” అన్నాను ఆశ్చర్యంగా. “ఎందుకంటే మమ్మీకి మిమ్మల్ని హేట్ చేయడం తెలియదు కనుక” అన్నాడు. వాడు నిజాయితీగా. వాడి మాటల్లో నిజాయితీ నా హృదయాన్ని తడిచేసింది. ఇంక నేనమీ మాట్లాడలేకపోయాను. వాడు మౌనంగానే ఉండిపోయాడు. స్కూల్లో అనురాగ్ మంచి మార్కులు సాధిస్తూ, ఆటల్లో రాణిస్తూ అన్నింట్లోనూ హీరోగా గుర్తించబడుతున్నాడు. తండ్రిగా నేను గర్వపడుతున్నానేగానీ వాడి ఎదుగుదలను నేను చేసిందేమీ లేదు. నిజానికి వాడిని ఈ వయసులో ఎన్నో విషయాల్లో నేను క్లోజ్ గా గైడ్ చేయాలి. తగిన విధంగా తర్ఫీదునివ్వాలి. 

కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. తోడుగా నిశి లేని జీవితం ఆది, ఆద్యంతాలు. ఏమీ అర్థం కావడం లేదు. ఆఫీసులో నాకు ప్రమోషన్ వచ్చింది. ఎందరో నన్నభినందిస్తూ బోలెడు ఫోన్కాల్స్, మెసేజ్ లతో విష్ చేస్తున్నారు. సంతోషాన్ని షేర్ చేసుకోవానికి ఇప్పుడు నిశి లేదు. ప్రమోషన్ విషయం ఆమెకి తెలియదు. ఒకవేళ తనుంటే ఎంత హ్యాపీగా ఫీలయ్యేదోనన్న తలంపుతో గుండెల్లో దుఃఖం సుదులు తిరుగుతోంది. నాలోకి నేను కుంచించుకుపోతూ నన్ను నేను ఓదార్చుకోవడం తప్ప మరెవ్వరితో షేర్ చేసుకోలేని దుస్థితి. ఆరోజు నా జన్మదినం. ఎప్పటిలాగే ఎలాంటి మార్పు ఉండదనుకున్నాను. కానీ ఉదయం లేవగానే అనురాగ్ అందమైన ఫ్లవర్ ్బ్కను అందిస్తూ. “హ్యాపీ బర్త్డే” అంటూ విష్ చేసి నన్ను సర్ప్రైజ్కె గురి చేశాడు. అంతేకాదు, వాడు స్కూల్కి వెళ్తూ నా టేబిల్ మీద ఒక బర్త్డే కార్డు ఉంచి వెళ్లాడు. అందులో- “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్ డే.. ఐ లవ్యూ డాడ్.. యువర్స్ లవింగ్ సన్.. అనురాగ్” అని, నా పట్ల వాడికున్న ప్రేమ, గౌరవం నా హృదయాన్ని కదిలించింది. అవును.. వాడెప్పుడూ తల్లిబిడ్డే. ఈ మధ్య వాడిలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మ్యాచ్యూర్డ్ బిహేవ్ చేస్తున్నాడు. దేనికో వాడి గదిలోకెళ్లాను. 

తల్లికి సంబంధించిన వస్తువులన్నీ ఎంతో భద్రంగా దాచుకున్నాడు. మమ్మీ, స్త్రీలతో కలిపి తీయించుకున్న ఫొటో స్టడీ టేబుల్ మీద వాడికెదురుగా అమర్చుకున్నాడు. అనురాగ్, నిశగంధ చాలా సంతోషంగా బహుశా.. మళ్లీ వాడి పసిమనను ఆ రోజుల్ని గాఢంగా కోరుకుంటున్నాడన్న సత్యం నాకు. బోధపడింది. మనసంతా దిగులుమేఘం ఆవరించింది. ఎందుకో ఆరోజు అఫీసుకి వెళ్లాలనిపించలేదు. సెలవు పెట్టేశాను. ఆ సాయంత్రం అనురాగ్ గుమ్మంలోంచే “హాయ్ డాడ్..!” అంటూ చేతిలో పెద్ద బర్త్డే కేక్ తో హుషారుగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. అసలు అప్పటివరకు నేను బర్త్డే కేక్ గురించి ఆలోచించలేదు. అంతలోపే అనురాగ్ తీసుకొచ్చాడు. అంతే… అమాంతం వాడిని కౌగిలించుకున్నాను. “డాడ్.. ప్లీజ్ వన్ స్మాల్ రిక్వెస్ట్” అన్నాడు అనురాగ్. “ఏంటి?” “ఈసారి మీ బర్త్ డేకి మా ట్యూటర్ని మన గెస్ట్గా ఇన్వయిట్ చేద్దాం డాడ్.. ప్లీజ్” అన్నాడు అనురాగ్ అభ్యర్థిస్తున్నట్లుగా. ఒకప్పుడు ఎవరూ నా ఇంటికి రావడం నాకిష్టముండేది కాదు. ముఖ్యంగా నా జన్మదినాన్ని పక్కన నా నిశి లేనందున ఒక్క నా బాబుతోనే గడపాలనుకున్నాను. కానీ వాడేమో వాడి ట్యూటర్ అంటున్నారు. వద్దంటే వాడు ఫీలవుతాడేమోననుకుని “ఒకే, నీ ఇష్టం..” అన్నాను. అంతే.. వాడు బయటికెళ్లి క్షణాల్లో వాడి ట్యూటర్ని వెంటబెట్టుకొని లోపలికి వచ్చాడు.

ఆశ్చర్యం… ఒక్కసారి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. “నిశీ..” అవును.. నా ‘నిశిగంధ’ మళ్లీ నా ఇంట్లో వాట్ ఎ సర్ప్రైజ్.. నమ్మశక్యంగా లేదు. నేను ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే తను అన్నీ మర్చిపోయి హుందాగా ఇల్లంతా తిరుగుతూ “హు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. అన్నీ నేనే సరిదిద్దాలి. అదిగో.. అక్కడున్న ఆ వెర్రిమనిషిని కూడా” అని నవ్వుతూ నా వంక చూపెడుతోంది అనురాగ్కి, అనురాగ్, నేనూ, నిశి మనసారా నవ్వుకున్నాం. మళ్లీ ఇన్నాళ్లకు నిశి రాకతో ఈ ఇంట్లో ఇంత సంతోషం. మా ముగ్గురి కళ్లల్లోంచి ఆనందభాష్పాలు రాలిపడ్డాయి. ఇన్నాళ్లూ అనురాగ్ వెనకాల ఎవరున్నారో.. వాడిలోని మార్పుకి కారణమెవరో నాకిప్పుడే అర్థమయింది. తను దూరంగా ఉన్నప్పటికీ ఒక ట్యూటర్గా అనురాగ్ వెనకాల నిలిచి వాడిని చక్కగా తీర్చిదిద్దింది నిశి. అన్నింట్లో వాడిని ముందుండేలా చూసింది. 

అంతేకాదు, తనే వాడితో నాకివాళ బర్త్ డే కార్డ్ పంపించింది. డాడీని ప్రేమించాలని వాడిని నిరంతరం ప్రేరేపించింది కూడా తనే. నిశి దగ్గరికెళ్లి “అయాం వెరీ సారీ నిశీ.. నన్ను మన్నించవా.. ప్లీజ్!” అన్నాను పశ్చాత్తాపంగా. “హు.. మీరూ నన్ను క్షమించాలి. మనిద్దరం కలిసి అనవసరంగా అనురాగ్ని వేదనకు గురి చేసినందుకు మనం విచారించాలి” అంది నిశి ఏమాత్రం తడుముకోకుండా. అవును.. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలో సత్యం ఉంది. ఆమెలో ఒక * ప్రత్యేకత ఉంది. రియల్లీ షీ ఈజ్ యూనిక్. ఇన్నాళ్లు అది తెలుసుకోలేక నా మూర్ఖత్వంతో తనని నేను దూరం చేసుకున్నాను. ఏదేమైనా అర్థంలేని మా ఆవేశాలని, పంతాలని లెక్కచేయక, అనురాగ్ మా ఇద్దరి ప్రేమతో చక్కగా ఎదిగాడు. మళ్లీ మమ్మల్నిలా చూస్తూ అనురాగ్ గెలుపు సాధించినట్లు విజయదరహాసంతో వెలిగిపోతున్నాడు. అవును.. అన్నింటినీ అధిగమించి, మమ్మీ-డాడీలను మళ్లీ కలపడమే అనురాగ్ అతిపెద్ద గెలుపు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870