కేరళ రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)ని నిలబెట్టింది. కమలం పార్టీ నిర్ణయం అక్కడి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. మరో వారం రోజుల్లో కేరళ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 9, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సమయాత్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో కమలం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగానే మున్నార్ (Munnar) పంచాయతీ ఎన్నికల్లో ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)అనే మహిళను బరిలోకి దింపింది.
Read Also : http://Chennai Metro : చెన్నై మెట్రోలో సాంకేతిక సమస్య.. సబ్‌వేలో ఆగిపోయిన రైలు…

ఇక ఈ స్థానానికి హస్తం పార్టీ మంజుల రమేష్‌ను నిలబెట్టింది. అయితే, ప్రత్యర్థి పేరు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పేరు కావడంతో ఆ పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. సోనియా గాంధీ పేరుండడం వల్ల ఎన్నికల సమయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి ‘సోనియా గాంధీ’ పేరు స్థానికంగా మార్మోగిపోతోంది. ఆ మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :