దేశవ్యాప్తంగా గవర్నర్ అధికారిక నివాసం మరియు కార్యాలయంగా ఉపయోగించే రాజ్ భవన్‌కు కొత్త పేరు నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం ఇకపై అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ భవనాలను ‘లోక్ భవన్’ (Lokbhavan)పేరుతో పిలవాలని వెల్లడించింది.
Read Also: Komatireddy: ఎమ్మెల్యే సూచనలతో మద్యం షాపుల నియంత్రణ

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు
దేశంలోని కొన్ని(Lokbhavan) రాష్ట్రాల్లో ఈ మార్పు అమల్లోకి వచ్చిందని సమాచారం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి. పేరుమార్పు ప్రక్రియను త్వరలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయం
ఈ మార్పు కొత్తది కాదని, గవర్నర్ల సదస్సులో రెండు సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పుడు కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో మార్పు అమలు దశలోకి ప్రవేశించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: