రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
HYD వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు (farmers) యాసంగి (రబీ) సీజన్‌లో వేరుశనగ (Groundnut) సాగు అనువుగా ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా వేరుశనగ సాగు చేస్తే మంచి లాభాలు ఉంటాయని వారు అన్నారు. మంచి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Also: IGNITION Conference: చెన్నైలో IGNITION సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న KTR

వరికి ప్రత్నామ్నాయంగా వేరుశనగ
కృషి విజ్ఞాన కేంద్రంలో వేరుశనగ సాగుకు అవసరమైన విత్తనాలు తయారుచేశారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరికి ప్రత్యామ్నాయ పంటగా రబీలో వేరుశనగ పంటను రైతులకు సిఫారసు చేశారు. కేవీకే రూపొందించిన వేరుశనగ విత్తనాల రకాలపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.
సాగు ప్రాంతాలు మరియు నాటే సమయం
తెలంగాణలో (Telangana) వేరుశనగను సుమారు 1.3 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 70 శాతం వరకు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు.
యాసంగిలో వేరుశనగ పంటను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ రెండో పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. అధిక దిగుబడి సాధించాలంటే అనువైన రకాల ఎంపిక చేయాలి. రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనువైన చీడ పీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
కేవీకే కొత్త వంగడం: కదిరి లేపాక్షి (కే 1812)
కృషి విజ్ఞాన కేంద్రంలో తొలిసారిగా రెండేళ్ల కిందట నూనె గింజలు సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా అందులో తయారు చేసిన కదిరి లేపాక్షి (కే 1812) వెరైటీ వంగడాలను పరిచయం చేశారు. తొలి దశలో పది హెక్టార్ల విస్తీర్ణంలో ఈ వంగడాలను విత్తి రైతులకు పరిచయం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: