రూ. 39 లక్షలు, 25 ఎటిఎం కార్డులు స్వాధీనం
మదనపల్లె క్రైమ్ : మదనపల్లి(Cyber crime) కేంద్రంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన పఠాన్ ఇంతియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ హర్షద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం రాయచోటిలో మీడియాకు వెల్లడించారు. పి కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్సు రేపురి బెంజిమెన్ను లక్ష ్యంగా చేసుకున్న నిందితులు, సీబీఐ, ఈడీ అధికారుల మంటూ బెదిరించారు, మీ మీద కేసు ఉంది అంటూ బెంజిమెన్ ను ఫోన్ ద్వారా భయపెట్టారు.
Read also: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

డిజిటల్ అరెస్టు పేరిట మోసం..1930కి కాల్ చేయాలని ఎస్పీ సూచన
డిజిటల్ అరెస్ట్(Cyber crime) పేరుతో వీడియో కాల్లో ఉంచి మీ పాన్ కార్డు ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన ఓ ముఠా 48 లక్షల రూపాయలు మోసం చేశారని దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వెంటనే అమోంటు పంపకపోతే పక్కనే ఉన్న మా పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారంటూ భయపెట్టి రూ.48 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయానని తెలుసుకున్న బెంజిమెన్ మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తులో భాగంగా రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులు పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా, ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు.
ఈ ముఠా కాంబోడియా కువైట్(Cambodia Kuwait) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన డీఎస్పీ మహేంద్ర, సీఐ మహమ్మద్ రఫీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలకు ఎస్పీ హెచ్చరిడిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఇక్కడ లేదని జిల్లా ఎస్పీ సూచించారు. ఎవరూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయటం, ఆన్లైన్లో డబ్బులు అడగటం ఉండదన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానం వచ్చిన వెంటనే 1930 కు కాల్ చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: