ఇటీవలి రోజుల్లో ఢిల్లీలో(Delhi) అకస్మాత్తుగా పలు విమాన సర్వీసులు రద్దుకావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. ఈ గందరగోళానికి GPS స్పూఫింగ్ అనే నకిలీ సిగ్నల్ జోక్యం కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థకు తప్పుదారి పట్టించే ఫేక్ సిగ్నల్స్ రావడంతో పైలట్లు సరైన నావిగేషన్ డేటా పొందలేకపోయారని ఆయన వివరించారు.
Read also: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం

ఈ ప్రభావం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అమృత్‌సర్, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాలకూ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలో వ్యత్యయం కలిగించే ఫేక్ సిగ్నల్స్ నమోదయ్యాయి. దీని వల్ల విమానాల రూట్ ప్లానింగ్, లాండింగ్ గైడెన్స్, మూమెంట్ డైరెక్షన్ వంటి కీలక వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
జాగ్రత్త చర్యలు: గ్రౌండ్ నావిగేషన్ యాక్టివేషన్
GPS స్పూఫింగ్ అలెర్ట్‌లు వచ్చిన వెంటనే, కేంద్రం తక్షణ చర్యలు చేపట్టింది. మంత్రి వివరించిన ప్రకారం, శాటిలైట్ ఆధారిత నావిగేషన్‌లో సమస్య కనిపించగానే గ్రౌండ్ నావిగేషన్ మరియు సర్వైలెన్స్ సిస్టమ్స్‌ను వెంటనే ప్రారంభించారు. దీని ద్వారా పైలట్లు నేల ఆధారిత సిగ్నళ్లను ఉపయోగించి విమానాన్ని నడిపే అవకాశం లభించింది. సాంప్రదాయ నావిగేషన్ సిస్టమ్స్‌కు తిరిగి మారడం వల్ల ప్రమాదాలను నివారించగలిగామని మంత్రి రాజ్యసభలో తెలిపారు. ఈ కార్యకలాపాలు తాత్కాలిక జాగ్రత్త చర్యలు మాత్రమేనని, శాటిలైట్ నావిగేషన్ స్థిరపడిన తర్వాత సేవలు సాధారణ స్థితికి వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు.
ఫేక్ సిగ్నల్స్ మూలాన్ని గుర్తించే ప్రయత్నం
GPS స్పూఫింగ్ సిగ్నల్స్ ఎక్కడినుంచి వచ్చాయో కనుగొనడం ప్రస్తుతం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ వ్యవహారంపై పలు ఏజెన్సీలు కలిసి విశ్లేషణ చేస్తున్నారు. రక్షణ, గగనతల భద్రతకు సంబంధించిన శాఖలూ ఈ పరిశోధనలో భాగం అయ్యాయి. సిగ్నల్ సోర్స్ గుర్తించిన తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఢిల్లీలో విమానాలు ఎందుకు రద్దయ్యాయి?
GPS స్పూఫింగ్ వల్ల శాటిలైట్ నావిగేషన్‌లో అంతరాయం ఏర్పడింది.
ఏ ఏ నగరాలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయి?
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అమృత్‌సర్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: