ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.. బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం రోజున ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read Also: AP: 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో మంగళవారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఇవాళ సాయంత్రం,5PM వరకు నెల్లూరు(D) కొడవలూరులో 38.7mm, నెల్లూరులో 36.7mm, తిరుపతి(D) తడలో 33.5MM వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: