ఆంధ్రప్రదేశ్ (AP) లో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ (AP) లోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ (Water aerodromes) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.
Read Also: Vizag: స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం

సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు
సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: