పెళ్లంటేనే బోలెడంత పనులు ఉంటాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, సంబంధాలు చూసి, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పెళ్లి చేస్తారు. నెలల తరబడి ఇందుకు సిద్ధపతారు. కానీ అత్తింటికి వచ్చిన ఓ నవవధువు పట్టుమని 20 నిమిషాలైన ఉండకుండా, విడాకులు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగు చూసింది. (Uttar Pradesh) పెళ్లి జరిగిన మరుసటి రోజు అత్తారింటికి వచ్చిన పెళ్లికూతురు కేవలం 20 నిమిషాలు కూడా ఉండకుండానే భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించింది. వెంటనే పుట్టింటికి వెళ్లాలనే ఆమె పట్టుదలతో గంటల తరబడి పంచాయితీ జరిగింది. చివరకు పెళ్లి రద్దయ్యింది. డియోరియా నగర పంచాయతీ ప్రాంతానికి చెందిన యువకుడికి సలేంపూర్ నగర పంచాయితీకి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 25న డియోరియాలోని ఓ మ్యారేజ్ హాల్ కు వరుడి బరాత్ వచ్చింది. వధువు తరపువవారు ఘనంగా స్వాగతం పలికారు. ద్వారపూజ, జైమాల సహా హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం(Marriage) జరిగింది.
Read also: స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం

భర్తతో కాపురం చేయను: వధువు
మరుసటి రోజు ఉదయం నవంబరు 26న పెళ్లికూతురు(Uttar Pradesh) అత్తవారింటికి చేరుకుంది. మహిళలు ఆమెను లోపలికి తీసుకెళ్లి ‘ముఖం చూసే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరిగ్గా ఆ సమయంలోనే పెళ్లికూతురు ఒక్కసారిగా బయటకు వచ్చి అత్తవారింట్లో ఉండటానికి ససేమిరా నిరాకరించింది. వెంటనే పుట్టింటి వారిని పిలిపించాలని పట్టుబట్టింది. వరుడి తరపు వారు, భర్త ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తర్వాత పంచాయితీ పెడితే, అత్తవారింటి వారి ప్రవర్తన నచ్చలేదని, భర్తతో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. చివరికి జరిగిన పంచాయితీలో ఇరుపక్షాలు ఒకరికొకరు ఇచ్చిన సామూను, బహుమతులు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. పంచాయితీలోనే ఇరుపక్షాలు పరస్పర అంగీకరాంతో విడిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: