గుడ్డు(Egg) అనేది ప్రోటీన్లకు ప్రధాన వనరు. ఉదయం అల్పాహారంలో భాగంగా ఎక్కువ మంది దీనిని తీసుకుంటారు. అయితే గుడ్డును మొత్తంగా తినాలా? లేక తెల్లసొన–పచ్చసొన వేర్వేరుగా తీసుకుంటే మేలా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయంలో నిపుణులు స్పష్టమైన వివరణ ఇస్తున్నారు.
Read Also: Brain Foods : మీ పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలను పెట్టండి

గుడ్డులో(Egg) విటమిన్స్ A, D, E పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. విటమిన్ B12, ఫోలేట్ రక్తకణాల నిర్మాణానికి, మెదడు పనితీరుకు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఐరన్, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి ఆక్సిజన్ రవాణాలో సహాయపడతాయి. కోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధి, కాలేయ పనితీరుకు అవసరం.
గుడ్డు తెల్లసొన ప్రయోజనాలు
తెల్లసొనలో ఫ్యాట్ ఉండదు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. రిబోఫ్లేవిన్ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల హృదయసంబంధ సమస్యలు ఉన్నవారికి తెల్లసొన ఎక్కువగా ఉపయోగపడుతుంది.
పచ్చసొనలోని ముఖ్య పోషకాలు
పచ్చసొనలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి కొలెస్ట్రాల్, అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటాయి. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి. అలాగే రిబోఫ్లేవిన్, విటమిన్ B12, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరం టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన కొలెస్ట్రాల్‌ను కూడా పచ్చసొనే అందిస్తుంది. కండరాల నిర్మాణం, శక్తి స్థాయిలు పెరగడానికి పచ్చసొన ఉపకరిస్తుంది.
అయితే ఒక గుడ్డు పచ్చసొనలో సుమారు 186 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. వయో వృద్ధులు లేదా హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు పచ్చసొనను డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవటం మంచిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: