हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: DK Shivakumar: మీడియా ఒత్తిడి వల్లే బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది: డీ.కే. శివకుమార్

Anusha
Latest News: DK Shivakumar: మీడియా ఒత్తిడి వల్లే బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది: డీ.కే. శివకుమార్

ఇటీవల, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ (DK Shivakumar) కలిసి బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.అయితే, బ్రేక్‌ఫాస్ట్ చర్చలకు ఎందుకు కూర్చున్నామనే విషయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ వివరించారు. మీడియా ఒత్తిడి కారణంగానే తాము కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: TG: ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు మోదీని ఆహ్వానించిన రేవంత్

“మరి మీరు సిద్ధరామయ్యను ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానిస్తున్నారు?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది తమ ఇద్దరికి సంబంధించిన విషయమని డీ.కే. శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్‌ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

సిద్ధరామయ్య స్థానంలో డీ.కే. శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్గం కోరుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో రెండు వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డీ.కే. శివకుమార్ ఈరోజు స్పందించారు.సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.

Breakfast meeting held due to media pressure: D.K. Shivakumar
Breakfast meeting held due to media pressure: D.K. Shivakumar

మీడియా పై ఆవేదన వ్యక్తం చేశారు

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్ లేదా డీ.కే. శివకుమార్ గ్రూప్ అంటూ ఏమీ లేవని స్పష్టం చేశారు. మీడియా మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గ్రూప్‌లు ఉన్నట్లు ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఒత్తిడి వల్లే తాము ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చర్చలు జరిపామని తెలిపారు.

“సిద్ధరామయ్య గ్రూప్, డీ.కే. శివకుమార్ గ్రూప్, మరో గ్రూప్ అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ చర్చల్లో పార్టీ గురించి మాట్లాడుకున్నాం. దీని గురించి మీడియా ఆలోచించకపోవడం మంచిది” అని డీ.కే. శివకుమార్ అన్నారు.

ఆయన ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు?

డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870