हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Four children : నలుగురు పిల్లలు

Abhinav
Four children : నలుగురు పిల్లలు

ఆయన ఆధ్యాత్మిక వక్త.. ఆఒకరోజు ఆయనను అనుకోకుండా కలిపాము అప్పుడు ఆయన నాకు ఏ సంబంధం లేని ప్రశ్న అడిగారు. ఆదేంటంటే- “దశరథుడికి ఎందుకు నలుగురు పిల్లలు పుట్టారు?” అని “నాకేం తెలుసండీ? అది దశరథుడిని మీరు అడగవలసిన ప్రశ్న” అని నెమ్మదిగానే చెప్పాను. “దశరథుడు అడిగింది ఒక కొడుకునే” అన్నారాయన. “అలాగా” అన్నాను. “అవును..” అన్నారాయన, తన తదనంతరం రాజ్యాన్ని పాలించడానికి తాను సద్గతి పొందడానికి దోహదపడుతుందని దశరథుడు అడిగింది. ఒక్క కొడుకునే. అలాగే దేవతలు అడిగిందేమో రావణుడిని వధించడానికి ఒక రాముణ్ణి. 

అటువంటప్పుడు ఎందుకు నలుగురు పిల్లలు.. దీనికి జవాబుగా ఆయన విడవరిచి చెప్పారు.ఈ ప్రపంచంలో నాలుగు రకాల ధర్మాలు ఉన్నాయి. ఆ నాలుగు ధర్మాలు అనుసరించి రాజ్యంలోని ప్రజలకు చూపాలని ఆ నలుగురు సోదరులు పుట్టారు. అంతేకాకుండా రావణుడిని వధించేందుకు కాదు.. అన్నారు. అదేమిటీ, నాలుగు రకాల ధర్మాలు..? మొదటిది.. సామాన్య ధర్మం. అదేమిటంటే- పిల్లలు కన్నతల్లిదండ్రుల వద్ద ఎలా నడచుకోవాలో అని. శిష్యుడు గురువు దగ్గర ఎలా నడచుకోవాలి.. భార్య భర్త దగ్గర ఎలా నడచుకోవాలి.. ఇటువంటివన్నీ సామాన్య ధర్మాలు. ఇవన్నీ అనుసరించి చూపించినవారు రాముడు. 

సామాన్య ధర్మాలను సక్రమంగా అనుసరిస్తే చివరికి ఓ స్థితి వస్తుందట. ఆ స్థితిలో భగవంతుడి పాదపద్మాలే శరణ్యం. ఆది నిరంతరం, కృష్ణలీలా తరంగిణి రచయిత కలువపువ్వుల్లాంటి నీ పాదాలను చుట్టూ తిరిగే భ్రమరంలా నేనుండాలి అని కోరుకున్నారట. ఇటువంటి ధర్మానికి శేష ధర్మం అని పేరు. దీనిని అనుసరించి చూపిన వారున్నారు. వారిలో ఒకడు లక్ష్మణుడ సరే, మూడవది ఏమిటీ…. విశ్వర ధర్మం. అంటే మారాన ఉంటూ వెడు ఎప్పుడూ భగవంతుడి వ్యాపకమే ST ఉండటం. శేష ధర్మం కన్నా విశేషాలు ధర్మం కఠినం. భగవంతుడికి పక్కనే ఉంటూ అతని ధ్యాసలోనే ఉండటం కష్టం కాదు. కానీ దూరాన ఉంటూ. 

అనేది ఒకింతో అతనిని స్మరించడం కష్టమే. అలా అనుసరించి చూపించినతను భరతుడు.. ఇక నాలుగవ ధర్మం విషయానికి వస్తే ఇందుకు ఉదాహరణగా శత్రుఘ్నుడిని చెప్పుకోవచ్చు. అదెలాగంటే- ఈ నాలుగో ధర్మంలో భగవంతుడి కన్నా అతని దాసులకు సేవ చేయడమే ఆ ధర్మం దీనిని అనుసరించి చూపించినతను శత్రుఘ్నుడు. అందుకే భరతుడిని విడవకుండా వెంటే ఉంటూ అతని సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. ఈ విధంగా నాలుగు రకాల, ధర్మాలను అనుసరిస్తూ ప్రజలకు చూపించడానికే భగవంతుడు నాలుగు అవతారాల్లో ఆయన మరికొన్ని విషయాలు కూడా చెప్పారు.

కృతము అంటే చేయబడినది. దీనినే సత్యయుగము అని కూడా అంటారు. అంటే ఇక్కడ మనం ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి, ధర్మం చేయాలి అని ఎవరూ మనకు చెప్పక్కరలేదు. మనమే తప్పనిసరిగా చేయాలి అనుకొని ధర్మం చేయాలి. ఇక్కడ ధర్మం చేయడం అనేది స్వభావం. సహజంగా దర్శం చేసే యుగాన్ని కృతయుగం’ అంటారు. ఇక్కడ నాలుగు ధర్మం ఉంటుంది. ఒక్క పాఠం ధర్మం ఉండదు. ద్వాపర యుగంలో వర్మం రెండు పాదాల మీద నడుస్తుంది. మిగిలిన రెండు పాదాలు అధర్మం అన్నమాట. ప్రస్తుత కలియుగం విషయానికి వస్తే, ఒకరికొకరు పదని పూర్వపు యుగాలలో కలిసి ఉండడానికి కారణాలు వెదికేవారు. 

కలియుగంలో విడిపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. ఈ నాలుగు యుగాలూ మనలోనే ఎప్పుడైనా సాధించవచ్చనే విషయాన్ని మహాభారతంలో హనుమంతుడు భీముడికి వివరంగా చెప్పాడు. అవన్నీ అలా ఉండి ఇప్పటి సంగతికి వద్దాం. నాలుగు రకాల ధర్మాలను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుసరించి చూపించినా ఈనాటి ప్రజలు ఏ మేరకు వాటిని అనుసరిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే దానికి తగిన జవాబు రాదు. రామాయణం మీద ప్రసంగించడానికి ఒకాయన వెళ్తున్నారు. “ఎక్కడకు వెళ్తున్నారండీ?” అని అడిగింది ఆయన భార్య. 

“రామాయణం మీద ఉపన్యసించడానికి” అని, “నువ్వూ రావచ్చుగా!” అని అడిగారు. “నేను నండీ.. మీరు వెళ్లిరండి” అంది భార్య. “అదేమిటే అలా అంటున్నావు.. రాముడు అడవికి పోతున్నానని చెప్పడంతోనే సీత తాను అడవికి వస్తానని బయలుదేరింది కదా” అన్నారు. అప్పుడు ఆయన భార్య “సేతేమీ ఉత్తినే బయలుదేరలేదండీ.. ఇంట్లో వయస్సు మళ్లిన మామగారు, అత్తగార్లు, ఉన్నారు. అలాగే ఇతరులు. వారందరికీ వంట చేసి పెట్టడం, అలాగే మరిన్ని పనులు.. పెద్దవాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండటం.. రోజూ చెయ్యవలసిన పనులు.. అన్ని పనుల భారమూ తన మీదే పడుతుందని అలోచించి, వాటి నుంచి తప్పించుకోవడానికే సీత ‘తానూ” వస్తానని’ రాముడితో అడవికి బయలుదేరింది. అంతే తప్ప పతిభక్తి” కాదండీ” అంది భార్య. ఇంకేం మాట్లాడుతాడు ఆ ఉపన్యాసకుడు?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870