हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Retirement dues: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

Sudha
Latest Telugu News : Retirement dues: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వార ధులుగా పనిచేసిన ఉద్యోగులే నేడు అదే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలవుతున్నారు. మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు సేవలందిం చి పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చట్టబద్దంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ అందకపోవడం రాష్ట్ర పాలనను ప్రశ్నార్థకంగా నిలిపింది. 2024 మార్చి నుంచి పదవీ విరమణ చేసిన సుమారు 14 వేల మందికిపైగా పెన్షనర్లకు సంబంధించిన బకాయిలు (Retirement dues) నెలల తరబడి నిలిచిపోవడం కేవలంపరిపాలనా లోపం కాదు! మానవీయ వైఫల్యం. ఉద్యోగి రిటైర్ అయిన రోజు ప్రభుత్వం అతడిని గౌరవంగా ఇంటికి సాగనంపాలి. ఆ సమయంలో ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, టీఎస్ఓ ఎస్ఐ, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి మొత్తాలుఉద్యోగి ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేవి కావు. తన జీవన కాలంలో నెలనెలా జీతం నుంచి మినహాయిం చుకున్న సొమ్మే. అవి ఆలస్యం కావడం అంటే? వృద్ధాప్యం లో పెన్షనర్లను మనోవేదనకు గురి చేయడమే. పెన్షనర్ అనగానే ఈ దేశంలో ఇప్పటికీ ‘భారం’ అన్న దృక్కోణం ఉంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యవస్థను నిలబెట్టిన వేర్లు పెన్షనర్లే. పాఠశాలల్లో విద్యాబోధన నుంచి రెవెన్యూ కార్యాలయాల వరకు, పోలీస్ స్టేషన్ల నుంచి జిల్లా పరిపాలన వరకు, వ్యవస్థలను నడిపించిన వారు పదవీ విరమణ అనంతరం మాత్రం పరాయి వారిగా మారుతు న్నారు. రిటైర్మెంట్బెనిఫిట్స్ ఆలస్యం కావడం కారణంగా వృద్ధ పెన్షనర్లు అప్పుల ఒత్తిళ్లలో చిక్కుకుంటున్నారు. ఇంటి అవసరాల కోసం, వైద్య చికిత్స కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆశించిన సొమ్ము రాకపోవడంతో బ్యాంకుల ఈఎంఐ లు, ప్రైవేట్ అప్పుదారుల వేధింపులు భరించలేమనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మానసిక వేదన చివరకు ప్రాణాంతకంగా మారి ఇప్పటివరకు సుమారు 26 మంది పెన్షనర్లు మరణిం చారన్న విషయం సమాజాన్ని కలచివేసే అంశం. ఇన్ని జరు గుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం అమానవీయం.

Read Also : http://Village Cooking Channel: విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు

Retirement dues
Retirement dues

ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవడానికైనా పాలకులు సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. ‘ఆర్థిక లోటు అన్న ఒకే ఒక వాదన పెన్షనర్ల హక్కులపై దాడి చేసే ఆయుధంగా మారింది. ఆశ్చర్యకరమేమంటే – సేవ పేరుతో రాజకీయాలకు వచ్చి ఒక్కొక్కరు రెండు మూడు పెన్షన్లు తీసుకుంటున్న వారి వేతనాలు, అలవెన్సులు, అధికార విలాసాలకు ఈ ఆర్థిక లోటు అడ్డు రావడం లేదు. పెన్షనర్లు ప్రజాస్వామ్య పద్ధతి లోనే తమ గోడును వినిపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిపత్రాలు అందించారు. ‘సమస్య వాస్తవమే, పరిష్కరిం చాల్సిందే” అనే మాటలు వినిపించాయి. కానీ చర్యలు మాత్రం కనిపించలేదు. చివరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ లో నిర్వహించిన ధర్నాలో వేలాది వృద్ధ పెన్షనర్ల గుండెల్లోని బాధ రోడ్డుమీదకు వచ్చింది. మా బకాయిలను(Retirement dues)ఇవ్వండి మమ్మల్ని చంపవద్దు’ అన్న ప్లకార్డులు ఈ రాష్ట్ర ప్రజాపాల నకు అద్దం పట్టాయి. ప్రజస్వామ్యంలో పోరాడలేని వృద్ధుల సమస్యలకు స్వరంఇవ్వాల్సిన బాధ్యత మీడియా పై ఉంది. కానీ పెన్షనర్ల విషయంలో ఆ బాధ్యత ఎక్కడో తప్పిపోయిం ది. ఇది వ్యవస్థల వైఫల్యం కాకపోతే మరేమిటి? తమ వైక ల్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వానికి వినతులు సమర్పించినా స్పందనలేకపోవడం పాలకుల నిర్లక్ష్యాన్ని మరింత స్పష్టం చేస్తోంది. పెన్షనర్లు అడుగుతున్నది దానం కాదు. వారి శ్రమకు లభించే న్యాయమైన హక్కుమాత్రమే. ప్రజాస్వామ్యంలో పాలకులు గుర్తుంచుకోవలసిన మూల సూత్రం ఇదే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం అనేది ఒక ఆర్థిక నిర్ణయం కాదు, ఒకమానవతా పరీక్ష. పాలకులే తాము చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రులపట్ల బాధ్యతను గుర్తిస్తే, జీవి తాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లు కూడా తల్లిదండ్రులాంటి వారేనని గుర్తించాలి. ఇకైనా ప్రభుత్వం చొరవ తీసుకొని పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మరింత ఆలస్యం జరిగితే జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం లో హక్కుల కోసం వృద్ధులు రోడ్ల మీద నిలబడాల్సివస్తే, అదిపాలన ఓటమి. ఆ ఓటమిని ఒప్పుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా!. లేదంటే? ఇప్పటికైనా మానవీయ నిర్ణయం తీసుకొని పెన్షనర్ల కన్నీళ్లకు ముగింపు పలకాలి.
– మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870