సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 135 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పందిస్తూ, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడని కొనియాడాడు.
Read Also: Ruturaj Gaikwad: రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతు

కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కూడా ఇలాగే ఉండేది
కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతని ఆట చూశాక తాను దాదాపు ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని అన్నాడు. 2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కూడా ఇలాగే ఉండేదని కుల్దీప్ గుర్తు చేసుకున్నాడు.
కీలక సమయంలో కోహ్లీ ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని పేర్కొన్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా కోహ్లీ తన సహచరులకు సూచనలు చేస్తుంటాడని తెలిపాడు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని, అతని నుండి ఎంతో నేర్చుకోవచ్చని కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అన్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: