అత్యంత నివాస యోగ్యమైన టాప్ 100 నగరాల్లో ఢిల్లీ 54వ స్థానంలో ఉండి, మౌలిక వనరులకు సంబంధించి ఇక చూసుకోనక్కర్లేని నగరంగా వాసికెక్కింది. 2026 ప్రపంచ ఉత్తమ నగరాల ఎంపికలో జరిపిన అధ్యయన నివేదికలో రాజధానికి ఆ రకమైన ఖ్యాతి దక్కింది. అన్నీ బాగుండినా అయిదో తనమే తక్కువన్నట్లు ఢిల్లీని కాలుష్యం కమ్మేసి అక్కడ నివాసితులకు మతిస్థిమితం లేకుండా చేస్తోం ది. నిన్నగాక మొన్న ఢిల్లీకాలుష్యాన్ని(Delhi pollution) తగ్గించాలంటూ ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద జనంనిరసన వ్యక్తంచేశారు. ఇదేమి నిన్నో ఇవాళో పుట్టుకొచ్చిన సమస్యకాదు. దశాబ్దాల తరబడి ఉన్నదే. పాలకులు ఎన్ని చేసినా కాలుష్యకాసారాలు రాజ ధానిని వదిలిపెట్టడం లేదు. ఎంక్యూఐ నాలుగువందలు దాటిపోతోంది. ఢిల్లీ కాలుష్యం (Delhi pollution)తగ్గించే విషయంలో పాల కులు చేయని ప్రయత్నంలేదు. అప్రయత్నంగా దేశ అత్యున్నత ధర్మాసనం కూడా తమ జోక్యంవల్ల ఢిల్లీ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుందేమోనని భావించింది. అంతర్జాతీయ కాలుష్య బృందాలు, సుప్రీం నియమించిన అమికస్ క్యూరీ లు ఎన్నో నివేదికలిచ్చినా అవేమి కాలుష్య నివారణకు పనికి రాలేదు. చివరికి సుప్రీం కోర్టు కూడా కాలుష్య నియంత్రణకు చట్టాలకు అందని పరిష్కారంగా గురించి,ప్రత్యామ్నాయలు ఆలోచించాలని నిర్ణయించింది. ఢిల్లీ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సిఎసి) ద్వారా విశ్వప్రయత్నం చేసినా ఫలితం సున్నా. తక్కువ కాలుష్య నగరాలకు ఈ పథకం లక్ష్యాలకు లోబడి భారీగా కేటాయించారు. యథావిధిగా నిధులు ఖర్చయిపోయినా ఫలితం దక్కలేదన్నది నిర్వివాదాంశం. తాజా పరిస్థితులే ఆ అంశాన్ని తెలుపుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంతో 2024 నాటికి వాయు నాణ్యతా సూచిక అమలలో కాలుష్య రేణువులు పి. ఎం 20 నుంచి 30 శాతానికి తగ్గించే ప్రయత్నం. గాలిలో పెరిగిన వాయు కాలుష్య రేణువులు పీల్చినప్పుడు లేదా శోషణ కలిగినప్పుడు ప్రజలెవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులెదురౌతాయి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిందిదే. అతిపెద్ద సంఖ్యలో శ్వాసకోశరోగులు ఆసుపత్రుల పాలయ్యారు. ఘన, ద్రవ, కాలుష్య అణువులు ప్రమాదస్థాయిలో గాలి లోకి చేరిపోయి తేలియాడుతున్నాయి. పరిక్యూలేట్ మేటర్ 10 సురక్షిత స్థాయిని దాటిఉంది. ఇదే సమయంలో దేశంలోని 131నగరాలో ఈ బాపతు కాలుష్యాన్ని నియంత్రిం చేందుకు నిధులిచ్చినా వాటిని రోడ్డుమీద దుమ్ము తొలగిం చడానికి మాత్రమే వినియోగించారు. అప్పట్లోనే ఈరకమైన కాలుష్యాని కన్నా అతి ప్రమాదకారి పంట వ్యర్థాలే నని మరో నిర్ధారణకొచ్చారు.
Read Also : http://Indian Railways: ఏపీ నుంచి అయోధ్య–వారణాసి మార్గానికి వందేభారత్ స్లీపర్

పంట వ్యర్థాలు
బయోమాస్ పేర్కొనబడే పంట వ్యర్థాల విషయంలో రైతాంగం తమ బాధ్యతను విస్మరిస్తు న్నారనే ఆందోళన కూడా ప్రధానంగా పాలకుల దృష్టికి వచ్చింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఇతర రాష్ట్ర ప్రాంతాలు హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలో పంటల సాగు పూర్తయ్యాక పంట వ్యర్థాలను చేలోనే తగలబెట్టడం ఆనవాయి తీ. దానివలనే ఢిల్లీకాలుష్యం పెరిగిపోతోందన్న ఏకైక ఆలో చనతో పాలకులు చేపట్టిన కార్యాచరణలో భాగంగా అలా చేలోపంట వ్యర్థాలను తగలబెట్టిన భారీ మొత్తాల్లో జరిమా నాలు వేశారు. అయినా వారిని కట్టడిచేసే వ్యవస్థను రూపొం దించలేకపోయారు. చేలో దహనాల నివారణకు దాదాపు 15 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం వ్యయపరిచినా, కనీస స్థాయిలో కూడా వాటిని నిర్మూలించలేకపోయారు. ఉత్తరాది రాష్ట్రాలలో రైతులు తమ చేలలో పంట మార్పిడి వలన పంట వ్యర్థాల స్థాయి తగ్గించడానికి వీలవుతుందని భావించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ సంస్థ చైర్ ప్రొఫెసర్సూచనల మేరకు అలాంటి ప్రయత్నామూ జరిగింది. ఆ ప్రాంతంలోని భారీ పరిశ్రమలు సైతం కాలుష్యనివారణ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యనగరాల్లో ఢిల్లీ ఇప్ప టికే తనస్థానం నుంచి తప్పుకోలేకపోయింది. కేవలం ఢిల్లీ వంటి ప్రధాన నగరాలు, పారిశ్రామిక నగరాలు, జల, వాయు, ధ్వని కాలుష్యాలలో ఏమాత్రం స్వచ్ఛతస్థాయిని దక్కించుకో లేని పరిస్థితుల్లో ప్రపంచకాలుష్య భరిత
దేశాలలో ఇండియా ఐదో స్థానాన్ని చేరుకుంది.
క్లౌడ్బరస్
ఇటీవలనే ‘క్లౌడ్బరస్’ ప్రక్రియ కోసం కోట్లు వెచ్చించినా కనీస ఫలితాలను కూడా రాబట్ట లేకపోయింది. ప్రపంచంలోనే కాలుష్య ఉద్గారాలను 45 శాతం తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న భారతదేశం హరిత ఇంధనాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఎన్నోనిర్ణయా లు తీసుకోవడంలో ముందుంది. అయినా ఢిల్లీకాలుష్యాన్ని లొంగదీసుకునే ఏ ప్రణాళికను జయప్రదం చేసుకోలేకపో తోంది. ఇక్కడ గాలికాలుష్యం ప్రజల ఆయుర్దాయం, ఆరో గ్యంపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఈ మధ్య వార్తల్నిబట్టి అక్టోబరు నెలలో ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలోని 80 శాతం ఇళ్లల్లోకి విషపు గాలిసోకిందని సమాచారం. తాజాగా స్పోర్ట్స్ యాక్సి లిటీస్ మీదనిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఢిల్లీ స్కూల్స్ చలికాలంలో ఎక్కువస్థాయిలో స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం ఆనవాయితీ. కాలుష్యం పెరిగిన రీత్యా నవంబరు, డిసెంబరు నెలల్లో వాటిని నిర్వహించ డాన్ని నిషేధించినట్లు ఢిల్లీలోని అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు పంపింది. గాలి ప్రాణాంతకంగా మారిన పరిస్థితులుమెండు గా కన్పిస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోజు విడిచి రోజు కార్యాలయాల్లో విధి నిర్వహణకు రావాలని, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచే పనులు నిర్వహించాలనే వెసులుబాటునిచ్చింది. ఒకపక్క కాలుష్యం మరో పక్క పొగమంచు ఢిల్లీ ప్రజల్ని వేధిస్తున్నాయి. గత యేడాది ఇదే నెలలో పంట వ్యర్థాలు దహనం చేయడంతో ఎగసిపడిన మంటల నుంచి కాలుష్య రేణువులు జనాన్ని చిరాకుపెట్టా యి. ఉత్తరాది రాష్ట్రాలలో పంట వ్యర్థాలదహనం నిరాఘా టంగా సాగుతాయనడంలో అతిశయోక్తి లేదు. రైతులెవరూ ఇలాంటి వాటివిషయంలో వచ్చిన హెచ్చరికలేమీ లక్ష్యపెట్ట రు. జరిమానాలకు, కేసులకు భయపడరు. వారికి కావలసింది ఇస్తేతప్ప మాటవినే పరిస్థితి లేదు. రైతాంగానికి కావ లసిందేమిటి? అవన్నీ సమకూర్చినా కాలుష్య నివారణకు తగు హామీలుకానీ భరోసాలు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అప్పట్లోపంట దహనాలకుతోడు దీపావళి బాణసంచా కాల్చడంవలన ఏర్పడిన దహన వ్యర్థాలు అవశేషాలు కూడా ప్రమాదకారకమే. ఆ సమయంలో ఢిల్లీతోసహ ఏడునగరాల్లో కాలుష్య స్థాయి ఘనమీటర్కు 500 మైక్రో గ్రాములు స్థాయికి పెరిగిపోయింది.

చైనా అనుభవాలు
మళ్లీ ఈయేడాది అదే సమయం లో ఇప్పుడూపరిస్థితులు చేయదాటి పోకుండా జాగ్రత్త పడాలన్నా పాలకులకు తోచడంలేదు. మన అవస్థలుచూసి ఇటీవలనే చైనావారు మనకు బాసటగా ఉంటామని, కాలుష్య నియంత్రణలో చైనా అనుభవాలు ఇండియాకు పనికి వస్తా యని ప్రతిపాదించింది. ఉత్తరాది రాష్ట్రాలను ప్రధాని సంప్ర దించి ఇందుకు వారు సహకారం తీసుకోవాలని పాండిచ్చేరి మాజీ గవర్నర్ కిరణ్ బేడీ విజ్ఞప్తిచేశారు. భగవత్ సంకల్పిత,మానవ ప్రేరేపిత పరిస్థితులను ఏమేరకు సరిచేయగలమన్న ది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఢిల్లీలో మాస్క్ లు, ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం ఎక్కువగానే ఉంది. ప్రస్తుత వాతావరణ కాలుష్యాన్ని కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి ‘వెరీపూర్’ కేటగిరి కింద వర్గీకరించింది. నగరంలోని 16పర్య వేక్షణ కేంద్రాల మధ్య 400కన్నా ఎక్కువ ఎంక్యూఐ నమోదైంది. ఒక చోటైనా గాలి చలనం సరిగ్గా లేదు. పైగా శీతాకాలం గాలి నాణ్యత ప్రమాదకరస్థాయిలోకి చేరిపోయిం ది. ఢిల్లీ ప్రజలు శుద్ధమైన ప్రాణవాయువును, స్వచ్ఛమైన గాలిని కోరుకోవడమే తప్పా! అనేపరిస్థితి చర్చనీయాంశంగా ఉంది. పంటలు పండించి అన్నప్రసాదాన్ని అందిస్తున్నాడు కదా! అని పద్ధతికి విరుద్ధంగా పంటవ్యర్థాలు తగలబెడుతుంటే చూస్తూ ఊరుకోగలమా? అన్నసుప్రీం ధర్మాసనమే తాజాగా కాలుష్య నివారణకు ఇతరత్రా విధానాలపై సమీక్షిద్దాం. అని విశేషంగా యోచిస్తోంది. యేటా చలికాలం రాగానే ఈవాయుకాలుష్యం నగర ప్రజలపై విషం చిమ్మటాన్ని ఎవరూ హర్షించడం లేదు. తాము అనారోగ్యంతో కునారిల్లాల్సిందే నా? అని నిట్టూర్పులు మాత్రమే వినబడుతున్నాయి. కేవలం ఢిల్లీలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టడం వల్లనో, పంట వ్యర్థాల దహనంపై నిషేధం విధించడం వల్లనో ఢిల్లీ కాలుష్యానికి పరిష్కారం దొరుతుందని చెప్పలేం.
-వరిగొండ కాశీవిశ్వేశ్వర రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: