కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru traffic)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్(MP Rajiv Roy) పేర్కొన్నారు. నగర రహదారి పరిస్థితులు అత్యంత బారీన పడుతున్నాయని, ట్రాఫిక్ జామ్‌లను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయించారు.
Read Also: Nirmala Sitharaman: లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిష్ఠ కోల్పోతోందని
పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వడానికి ఢిల్లీకి వెళుతున్న సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని రాజీవ్ రాయ్ చెబుతూ, అంతటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ రోడ్లపై ఒక్క పోలీసు కనబడకపోవడం దారుణమన్నారు. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు బెంగళూరు పోలీసులను సంప్రదించినా వారు స్పందించలేదని ఆరోపించారు.
అందమైన నగరంగా పేరు పొందిన బెంగళూరు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిష్ఠ కోల్పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నా కూడా ట్రాఫిక్ విభాగం దానిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రజల్లో అసహనానికి దారితీస్తోందని రాజీవ్ రాయ్ అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: