గతంలోకి తొంగిచూస్తే హరియాణా లోని దబాSలీలో పాఠశాల వార్షికోత్సవ వేదిక అంటుకుని, ఒకటీ రెండూ మూడు కాదు… ఏకంగా 450 మంది బడిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపో యాయి. అంతుకుముందు ఉత్తరప్రదేశ్క చెందిన మేరత్ వాణిజ్య ప్రదర్శనలో అగ్నిజ్వాలలు ఎగసి ఎంతో మంది బతుకుల్ని బుగ్గిపాలు చేశాయి. ఇక ప్రాంతీయంగా మొన్నటికి మొన్న అగ్నికీలల్లో చిక్కుకుని పది మంది నిలువునా కాలిపోవడం భయంకర సంఘటన. నాలుగు అంతస్తుల ఆ నివాసాల్లో అగ్గి హైదరాబాద్ లోని బజారఘాట్లో ఒక అపార్ట్మెంట్ సముదాయంలో దిగువన (గ్రౌండ్ ఫ్లోర్) కారు గ్యారేజీ ఉంది. రిపేరుపని జరుగు తుండగా ఉన్నట్లుండి మంటలు లేచి పక్కనే ఉంచిన డీజిల్, రసాయనాల డ్రమ్ములు అంటుకుని అక్కడి నివాసాలు ప్రాణాంతకమయ్యాయి. ఆ ఘోరం ఇప్పటికీ పీడకలలా ఆ ప్రాంతీయులను వెంటాడుతోంది. భాగ్యనగర ప్రాంతంలో నిరుడు అతిపెద్ద అగ్నిప్రమాదాలు నాలుగు జరిగాయి. సంవత్సర ఆరం భంలోనే ఒక మాల్లో అగ్ని అందరినీ గడగడ వణికించింది. అటు తర్వాత కూడా పలు ప్రమాదాలు చోటు చోసుకు న్నాయి. ఇటువంటి సందర్భాల్లో మం త్రుల, ఉన్నతాధికారుల పరామర్శలు సర్వసాధారణం. కేసులు నమోదు చేశామంటారు, బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటారు, పరిహారం మొత్తాలు ఇస్తామని హామీలూ ఇచ్చేస్తుంటారు.

ఆ ప్రకటనల పర్యటనల హోరూ జోదూ తగ్గర పరిస్థితులు మళ్లీ మామూలే భారత శిక్షాస్మృతి కింద ఉన్న 285. 286 నిబంధనా ‘పేలుగు పదార్థాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి వెల్లడిస్తాయి అనే విధంగా జాతీయ స్థాయిన ఎక్స్ ప్లాజిన్స్ యాక్ట్ అనేది ఒకటుంది. అందులోని 9వ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడమూ పరపాణి, అంతవర! ఎప్పుడు ఎంత మందికి శిక్షలు పడ్డాయనేది ఎక్కడా వెల్లడి కాదు మరి అక్కడా ఇక్కడా అని లేదు.. అగ్నిప్రమాదాల నిరోధం, నివారణలకు కమిటీ ఏర్పాటు అన్నది. చిదంబర రహస్యమే. ఆంధ్రప్రదేశ్లోగానీ, తెలంగాణలోగాని అటువంటి కమిటీలు అసలంటూ ఉన్నాయా? ఉంటే అని చేస్తున్న పనేమిటి? అనేది జవాబు దొరకని ప్రశ్నలు, నివాస భవనాలు, గోదాముల్లో వరస ప్రమాదాలు జరిగిపోతున్నా అధికార యంత్రాంగాలు నిద్రమత్తు వీడటం లేదు. కొన్ని చోట్ల నివాస గృహాల పరిసరాల్లోనే వాణిజ్య వ్యవహారాలు కొనసాగుతున్నా సంబందిత అధికార బృందాలకు అవేమీ కనిపించవు. అర్హుల రోదనలు వాళ్ల దేవికి బొత్తిగా వినిపించను. ప్రమాదాలకు ఎంతైనా ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో అనుమతులు ఎలా వస్తున్నాయో, ఎవరిస్తున్నారో ఒక పట్టాన ఎవరికీ నేటికీ అంతుపట్టదు.

అంతెందుకు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మునుపు ఉన్నత న్యాయస్థానం ప్రధాన భవంతిలోనే ఒక చోట మంటలు, రేగాయి. అదివరకు న్యాయమూర్తుల సమావేశ మందిరానికి ఈ బెడద తప్పలేదు. అత్యంత జ్ఞాన సంపద నిండిన గ్రంథాలయ పుస్తకాలూ ఆనాడు కాలిపోయి ఆనవాళ్లు కోల్పోయాయి. అప్పటి ఆ ఘటన న్యాయవాదుల, న్యాయమూర్తుల మనసును ఎంతగానో కలచివేసింది. ఇవన్నీ కొంతమంది నేరపూరిత నిర్లక్ష్యా నికి అనవాళ్లు కావంటాలా? మరో ప్రధానాంశం ఏమిటంటే- అగ్ని మాపక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాలు పరంపరంగా కొనసాగుతుండటాన్ని ఉన్నత న్యాయ స్థానం ఇదివరకే తప్పు పట్టింది. అంతేకాదు, పౌరుల ప్రాణరక్షణ ప్రభుత్వాల ప్రథమ, ప్రధాన, బాధ్యత అని తేల్చి చెప్పింది. ఇది ఇప్పటి మాట కాదు, దశాబ్దాల నాటిది. అయినా స్థితిగతుల్లో ఎటువంటి మార్పూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కానరాకపోవడం అన్ని విధాల విచారకరం. అగ్ని నుంచి ప్రజల భద్రతకు సంబంధించి, ప్రభుత్వాలు గుర్తెరిగి వ్యవహరించాలన్నది నిస్సందేహం. ఏమై ప్రమాణాల మాటేమిటి? ఏ విధమైన భవనాలకైనా(నివాసాలు, వాణిజ్య సంబంధలు) నియమ నిబంధనలంటూ కొన్ని ఉన్నాయి.

మొత్తం జాతీయ స్థాయిలోనే ‘బిల్డింగ్ కోడ్’ అంటూ ఒకటుంది. ఏ భవంతి ముందైనా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటే, అక్కడ వాటి చుట్టూ కంచెలు నిర్మించి తీరాలన్నది & నియమం. ఆ కంచెలు అత్యంత దృఢంగా, రక్షక కవచాలుగా ఉండాలన్నది సారాంశం. అంతేకాకుండా, ఎటువంటి విపత్తు ముంచుకొచ్చినా తమ ప్రాణాలను తాము రక్షించుకునేలా నివాస ప్రాంతాల వారికి ముందస్తు శిక్షణ ఇవ్వాలనీ నిబంధన ఉంది. భవనాల నిర్మాణాలు/ నిర్వహణాలు/ పర్యవేక్షణలు సుశిక్షితుల ద్వారా కొనసాగాలని కూడా నియమావళి ప్రస్ఫుటం చేస్తోంది. ఏది. ఏమైనా భద్రతా ప్రమాణాలను విస్మరించుకోకూడదని, విస్మరించడమన్నది. కఠినాతి కఠిన శిక్షార్హమని న్యాయస్థానం ఏనాడో సృష్టీకరించింది. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగితే, ఏ నెంబరుకు ఫోన్ చేసి చెప్పాలో ఎంత మందికి తెలుసు? తమ ప్రదేశంలో ఎక్కడ ఆగ్నిమాపక కేంద్రం ఉందన్న అవగాహన వల్లెలో ఆ మాటకొస్తే పట్టణాల్లోనూ ఎందరికి ఉంటుంది. సమయానికి గుర్తుకు రాని పరిస్థితి ఎంత వ్యథాభరితం? అలా కాకుండా ప్రమాద సమాచారాన్ని సంబంధిత శాఖకు తక్షణమే చేరవేసే ‘యాప్’ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఉంది. ఆ మేరకు ఫోన్ యాప్ను దశాబ్దాలనాడే గోవాలో రూపొందించారు. అటువంటి ప్రత్యేక ఏర్పాట్లు మన దేశంలోనే మొదటిదనాలి. ఎంతో వేగవంత విధానం అది.

దాన్ని ఇతర అన్ని ప్రాంతాలకూ విస్తరించే కనీస ప్రయత్నమైనా జరిగిందా అంటే… ప్రశ్నార్ధకం. పైగా నిప్పును ఆర్పే దళం పని పరిస్థితుల్లో ఏమైనా మార్పులొచ్చాయా? అన్నదీ సందేహమే. ఆ విభాగ ఆధునీకరణ పరంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్(కాణ్) నుంచి నివేదిక సైతం ప్రభుత్వాలకు అంది దశాబ్దాలు గడిచిపోయాయి. బుట్టదాఖలవడం మామూలే! క్రియాశీలతే ప్రశ్నార్థకం!
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అగ్నిమాపక కేంద్రాల కొరత సరేసరి. ఆ భవన నిర్మాణాలు అంతంత మాత్రం. అక్కడ యంత్ర సదుపాయాలూ పరిమితం, సిబ్బందికి కటకట ఎప్పు డూ ఉండేదే. వాహనాలు పాత కాలం నాటివి. మొరాయించే సందర్భాలు లెక్కలేనన్ని. సిబ్బందికి అత్యాధునాతన పరికరాల వినియోగం మీద అవగాహన తక్కువ. సమగ్ర స్థాయిన శిక్షణ ఇచ్చిన దాఖలాలైనా లేవు, ఈ సమస్యల తీవ్రతను ‘కాగ్’ ఏనాడో వెలుగులోకి తెచ్చింది. కేవలం స్వల్పకాలిక మార్పులు చేర్పులతో ఒరిగేమీ ఉండదు. మధ్యకాలిక, దీర్పకాలిక ప్రణాళికలను ఆదరణకు తెస్తేనే ఫలితం ఉంటుందని ప్రభభుత్వాలకు మాత్రం తెలియదా? తెలిసినా వట్టించుకోని తత్వమే, ఉదాసీనతా స్వభావమే వేటు తెస్తోంది. కొంపణాలు వేల గునపంబు రేటుని/దాని తవ్వదేమి ఫలము కలుగుముందు చూపు లేని మూర్ఖుండు, చెడిపోవు’ అంటుంది. శతక పద్యం కల్లు కాలిపోతూ ఉంటే నిప్పును ఆన్సే ప్రయత్నమైనా చేయకుండా నీటి కోసం కానిని నిర్మించడం ఎంత మూర్ఖత్వమో ప్రస్ఫుటం చేసింది ఆ రచన.

సరిగ్గా అదే కోవలో ఏ విధమైన భవిష్యత్ ప్రణాళికా లేకుండా ఎప్పుడు ప్రమాదం సంభవిస్తే అప్పుడు చర్చోపచర్చలు సాగించడం అవివేకం కాదా మరి? విపత్తు స్పందన శాఖ పేరు మార్చుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ పేరుకు సరిప వ్యవహరించగలుగుతోందా? కేవలం పేరు మార్చేనుకుంటే సరిపోతుండా, తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదా.. అనేవి సామాన్యుల సూటి ప్రశ్నలు. తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాల హోటళ్లకు, దుకాణ సముదాయాలకు, ఆఖరికి వైద్యశాలల భవనాలకు సైతం అగ్నిభద్రత వసతులంటూ చాలా చోట్ల లేవు. ఏ భవంతి నిర్మించాలన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. నిరభ్యంతర పత్రాలను తప్పనిసరిగా పొందాలనీ సూచిస్తున్నాయి. ఆ నియమ నిబంధనలు, సూచనలు, సలహాలను ఎన్ని నిర్మాణ సంస్థలు పాటిస్తున్నాయో తెలుసు మనకు! ఎప్పుడూ తాత్కాలిక చర్యలే! భవన నిర్మాణదారులు చాలావరకు ఎటువంటి నిబంధనలనీ పాటించడం లేదు. ఏదో విధంగా పని పూర్తి చేసి చేతులు దులిపేసుకోవాలన్న తాపత్రయమే కానీ భద్రతా ప్రమాణాలు పాటించాలన్న ఆలోచన శూన్యం. మంటలంటుకుంటున్నాయి! నివాసం ఉంటున్నవారు సైతం చుట్టుపక్కల స్థితిగతులను గమనించలేని వైనం, ప్రమాదాల్ని పసిగట్టి నిరోధించలేని స్వభావం పెనువిపత్తులకు మూలమవుతున్నాయి.

నివారణకన్నా నిరోధమే మిన్న. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల పెనుప్రమాదాలు తప్పుతాయి. విశాఖలోని ఒక అపార్టుమెంటులో దీపావళి వేళ ప్రమాదం తీరును ఈ సందర్భంగా ఉదాహరిద్దాం. తారాజువ్వ ఆ భవంతిలోకి దూసుకెళ్లి నేరుగా ఐదో అంతస్తుకు చేరింది. అక్కడి బాల్కనీలోని ప్లాస్టిక్ సామగ్రి మీద పడి అంటుకుంది. అంతే. అగ్ని భగ్గుమంది. పొగ దట్టంగా కమ్ముకుంది. సరిగ్గా అదే భవనం పక్కన పెట్రోలు బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరో నగరంలో దీపాలు వెలిగిస్తున్న సమయంలో వస్త్రాలకు నిప్పంటుకుని ఒక మహిళ తల్లడిల్లుతుంటే ఆ మంటలను ఆర్పే యత్నంలో భర్త తన ప్రాణాలు కోల్పోయాడు. నిప్పును. ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక యంత్రం ఆ వీధిలో ఇదుకు కారణంగా ఎటూ కదలలేకపోయింది. ఈలోగా జరగకూడని నష్టం
జరిగిపోయింది. హోటళ్లు, ఆస్పత్రులతో పాటు అపార్టుమెంట్ల దగ్గర ఫైరింజన్ రాకకు తగినంత స్థలం ఉండాలి. ఆ వాహనం అటూ ఇటూ తిరిగేందుకు సరిపడా ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి. భవనాల ముందర పెద్ద పెద్ద ఆకారాల్లో హోర్డింగులు వంటివి ఉండకూడదు. బాగా నీటి సామర్థ్యమున్న ట్యాంకుల అమరిక, వెంటనే నీరు తోడేలా యంత్ర ఏర్పాట్లు నెలకొనాలి. ఇవన్నీ ఎంతమాత్రం అమలవుతున్నాయో తెలియనిదెరికీ? ప్రభుత్వ 4 శాఖల బాధ్యతా రాహిత్యం, ఎటువంటి పర్యవేక్షణా లేక పోవడం, ప్రమాదాలు తలెత్తినపుడు తాత్కాలిక చర్యలతో సరిపెట్టడం ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.

దడ పుట్టిస్తున్న గణాంకాలు జాతీయ స్థాయిలో గణాంకాలు రూపొందించే క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం అగ్నిప్రమాదాలు ఏటేటా సంఖ్యాత్మకంగా పెరుగుతూ వస్తున్నాయి. సిగరెట్లు కాల్చి విసరడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, కొన్ని రకాల ఉపకరణాలు పలు మానవ తప్పిదాలు మంటలు అంటుకునేలా చేస్తున్నాయి. నిరుడు మండుటెండల తీవ్రత భగభగలకు మూలమైంది. గోదావరి ప్రాంతంలో వేడిమికి, ఆ ధాటికి వరికుప్పలు అంటుకున్నాయి. అందిన వివరాలు వెల్లడి చేస్తున్నాయి. గతేడాది ఆ రాష్ట్రంలో నమోదైన అగ్నిప్రమాదాలు 7,368, అంతకు ముందరి ఏడాదికంటే ఇది 900 ఎక్కువ. ఆచరణ కావాల్సిందే! సినిమా థియేటర్లు, తదితర జనసమ్మర్థ ప్రాంతాల్లో కనీసం పాతిక వేల లీటర్ల నీటి సామర్థ్యమున్న ట్యాంకులు భవనాలపై భాగంలో ఉండాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదన్నది బహిరంగ విషయమే. నిబంధనలకు కొదవ లేదు. ఆచరణే కానరాదు. విదేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇప్పటికే రేటింగ్ విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. ప్రమాదాన్ని ముందుగా కనిపెట్టి హెచ్చరించే యంత్రాంగాలూ పుష్కలంగా ఉన్నాయి. అటువంటివేవీ లేనిది ప్రధానంగా మన దేశంలో. అందునా తెలుగు రాష్ట్రాల్లోనే. ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేది మచ్చుకైనా కనిపించని స్థితి. పౌరుల్లో ఎంత అవగాహనను పెంచగలిగితే అంత రక్షణ ఏర్పడుతుంది. ప్రతీ సంవత్సరం జరిగే అగ్నిమాపక వారోత్సవాలు వీటన్నింటి పైనా దృష్టి పెట్టాలి. అగ్ని నిరోధక పరికరాల వాడకం గురించి ఇంటా బయటా విస్తృత ప్రచారం సాగాలి. అప్పుడే ప్రాణాలకు, ఆస్తులకు భద్రత. వంద మాటల కంటే ఒక్క చేత (పని) ఎంతైనా ఉత్తమం!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: