డైరెక్టర్ బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న అఖండ2 (Akhanda 2) పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం పార్ట్ 2 పై అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమాలో, ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిన్నారి హర్షాలీ మల్హోత్రా ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
Read Also: Rashmika Mandanna : రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడాలంటే?
బాలయ్యతో కలిసి నటించడం నా అదృష్టం
బాలనటిగా అమోఘమైన నటన కనబరిచిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టింది. కథక్ నృత్యంలో శిక్షణ పొందుతూ సరైన అవకాశం కోసం ఎదురు చూసిన హర్షాలీ దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అఖండ2 (Akhanda 2)ద్వారా, వెండితెరపై కనిపించబోతోంది..

నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేరింగ్ అనుభవం గురించి హర్షాలీ మాట్లాడుతూ… “మొదట ఆయనతో నటించాలంటే భయం వేసింది. కానీ బాలకృష్ణ గారు చాలా కూల్, కేరింగ్ పర్సన్. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు.
ఆయన ఎనర్జీ అన్‌స్టాపబుల్. అంత చలిలో కూడా ఆయన ఒక్కసారైనా అలసట చూపలేదు. ఆయన్ని చూసి నేనూ యాక్షన్ స్టంట్స్ చేయగలిగాను” అని తెలిపింది. బాలయ్యతో కలిసి నటించడం తన కెరీర్‌లో పెద్ద బ్లెస్సింగ్‌గా భావిస్తున్నానని హర్షాలీ చెప్పింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: