కేంద్రీయ విద్యాలయ సంఘఠన్ (KVS), జవహర్ నవోదయ విద్యాలయ సమితి (Navodaya Recruitment) సంయుక్తంగా విడుదల చేసిన భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఉద్యోగార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో మొత్తం 14,967 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 13,025 టీచింగ్ మరియు 1,942 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ల సమర్పణకు మిగిలిన గడువు కేవలం మూడు రోజులు మాత్రమే. అభ్యర్థులు డిసెంబర్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Read Also: TET: టెట్ నుంచి ఇన్సర్వీస్ టీచర్లు మినహాయింపునకు పోరాటం

ఏ అర్హతలతో అప్లై చేయొచ్చు?
పదవులప్రకారం పలు విద్యార్హతలకు అవకాశం ఉంది. దిగువ అర్హతలతో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు:
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
- డిగ్రీ (Graduation)
- B.Ed, M.Ed
- MCA, BCA
- ME, M.Tech, BE, B.Tech
- M.PEd, B.PEd
- B.LiSc
- ఇంటర్, డిప్లొమా
- CTET అర్హత (PGTs, TGTs, PRTsకు సంబంధించిన పోస్టులకనుగుణంగా)
టీచర్ పోస్టులకు అనుభవం & CTET అర్హత ముఖ్యంగా కనిపించవచ్చు. నాన్ టీచింగ్(Navodaya Recruitment) పోస్టుల్లో అసిస్టెంట్, క్లర్క్, లైబ్రేరియన్, టెక్నికల్ పోస్టులకు అనుగుణంగా అర్హతలు ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?
అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, పరీక్ష పద్ధతి, సిలబస్ వంటి వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి.
అధికారిక వెబ్‌సైట్: kvsangathan.nic.in
ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశం
దేశవ్యాప్తంగా వందలాది క్యాంపస్‌లలో పని చేసే అవకాశం ఉండటంతో ఈ నియామకాలు ఉద్యోగార్థులకు గొప్ప అవకాశం గా భావిస్తున్నారు. స్థిరమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అప్లికేషన్లపై భారీ స్పందన నమోదవుతోంది. గడువు సమయం దగ్గరపడుతున్నందున అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: