మంత్రి దుర్గేష్ పర్యటన సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్కు హాజరుకానున్న మంత్రి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ను(Andhra Pradesh) సినిమా షూటింగ్ లకు, పర్యాటకానికి(Mumbai Summit) ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా “ది ఏఐ ఎరా – బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్” థీమ్ డిసెంబర్ 1, 2 తేదీల్లో ముంబయి జుహూలోని జేడ్ల్యూ మారియట్ హోటల్లో జరగనున్న ప్రతిష్టాత్మక “సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025″లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సభ్యులు, దేశ విదేశాలకు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ ప్రముఖులు, అంత ర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్లో ఎపిలో సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త “ఫిల్మ్ టూరిజం పాలసీ” గురించి మంత్రి దుర్గేష్ వివరించనున్నారు.
Read also: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌తో దొంగ మస్టర్లకు చెక్

సినిమా–పర్యాటక రంగాలను బలోపేతం చేయాలన్న దుర్గేష్
రాష్ట్రంలో అంతర్జాతీయ(Mumbai Summit) స్థాయి ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటు ఆవశ్యకతను తెలిపి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. అంతేగాక పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించి వారికి భరోసా కల్పించనున్నారు. సినిమాల ద్వారా పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో మంత్రి దుర్గేష్ ప్రసంగించనున్నారు. ఎపిలోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను వెండితెరపై చూపించడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తేవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా భారతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని 100 బిలియన్ల స్థాయికి చేర్చడంలో ఎపి తన వంతు సహకారం అందిస్తుందని, రాష్ట్రాన్ని సృజనాత్మక రంగానికి కేంద్రంగా మారుస్తూ “ఆంధ్రా వ్యాలీ”గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: