సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లారు.
Read Also: AP Weather: నేడు అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ప్రజావేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను పరామర్శించి స్వయంగా పింఛన్ అందజేశారు. అనంతరం నల్లమాడలోని ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం 8,190 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెల పింఛన్ల పంపిణీ కోసం మొత్తం రూ. 2738.71 కోట్లను విడుదల చేసింది. ముఖ్యమంత్రి (CM Chandrababu) పర్యటన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 3.35PMకు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: