భారత్, సౌతాఫ్రికా (IND Vs SA) మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ రెండో వికెట్‌కు 50కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత, క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు.
Read Also: Andre Russell: IPL కు రిటైర్మెంట్ ప్రకటించిన రస్సెల్
ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన మెరుపు హాఫ్ సెంచరీతో రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ హాఫ్ సెంచరీలను నమోదు చేయడంతో పాటు, కొన్ని కీలకమైన రికార్డులను సమం చేశారు. దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రోహిత్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.

కొన్ని కీలకమైన రికార్డులను సమం చేశారు
ఈ సమయంలో కోహ్లీ ఫుల్ ఫామ్‌లో కనిపించాడు. ఈ ఇద్దరూ వన్డేల్లో స్వదేశంలో 50ప్లస్ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది 18వ సారి. రోహిత్-కోహ్లీ జంట 39 వన్డే ఇన్నింగ్స్‌లో 17 సార్లు 50+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. మార్టిన్ గప్టిల్-కేన్ విలియమ్సన్ రికార్డును అధిగమించారు.
వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాల రికార్డు కుమార్ సంగక్కర-మహేల జయవర్ధనే పేరిట ఉన్నది. వీరిద్దరు 57 ఇన్నింగ్స్‌లలో 24 సార్లు ఈ భాగస్వామ్యాన్ని చేశారు. ఇది రోహిత్-కోహ్లీ కలిసి 392వ ఇంటర్నేషనల్ మ్యాచ్. గతంలో, భారత్ తరఫున మరే జంట కలిసి ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. రోహిత్-కోహ్లీ జోడీ.. సచిన్-రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించారు. సచిన్ టెండూల్కర్ – రాహుల్ ద్రవిడ్ 391 మ్యాచులు ఆడారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: