దక్షిణ ఢిల్లీలోని (Delhi) టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భయంకర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బూట్ల దుకాణంలో మంటలు చెలరేగి, అన్నాచెల్లెలు సహా నాలుగుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Read also: Maharastra: హైవేపై పులి.. గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్!

Fire accident in Delhi
మంటలకు కారణాలు నిర్ధారించేందుకు
పోలీసుల వివరాల ప్రకారం, నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బూట్ల దుకాణంలో సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరినప్పటికీ, మంటలు వేగంగా పై అంతస్తుల వైపు వ్యాపించాయి.
ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులను భవన యజమాని సతేందర్ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు. గాయపడిన మమత (40) 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. పోలీసుల క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు మంటలకు కారణాలు నిర్ధారించేందుకు ఘటనా స్థలంలో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: