దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy2025) లో ఊహించని విధంగా రెచ్చిపోయాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో, తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
Read Also: IND vs SA 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్..

అద్భుత ప్రదర్శన
అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెంగాల్ బౌలర్లపై దయ చూపలేదు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ సమయంలో అభిషేక్ 5 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. భారత దిగ్గజం యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కూడా ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇంతే వేగంగా హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.
హాఫ్ సెంచరీ తర్వాత కూడా అభిషేక్ శర్మ అదే దూకుడును కొనసాగించి అనూహ్యంగా 32 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు.ఇటీవల ఆస్ట్రేలియాపై జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ 40.75 సగటుతో మొత్తం 163 పరుగులు చేశాడు, ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రద్దు కాకపోయి ఉంటే, అభిషేక్ స్కోరు మరింత పెరిగేది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: