తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా సూర్యాపేట (suryapet) జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరో అయిదు నెలల్లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న ఒక ఎస్సై, సర్పంచ్ పోటీ కోసమే ముందుగానే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. స్వగ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలన్న కోరికతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read also: Inspiration: ధైర్యం… దివ్యాంగుల అసలైన శక్తి

Resignation from SI job to become Sarpanch
త్వరలోనే నామినేషన్
కోదాడలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలు అందిస్తున్న పులి వెంకటేశ్వర్లు, తమ స్వగ్రామం గుడిబండలో సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు. త్వరలోనే నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్త విషయం కాదు. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా రాజీనామా చేసి రాజకీయ పార్టీలతో చేరడం చూస్తూనే ఉన్నాం. కొందరు ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే, మరికొందరు పదవిలో ఉన్నప్పుడే ప్రజా సేవ కోసం ముందడుగు వేస్తుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: