Parliament Winter Session : రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి.
ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కీరన్ రిజిజూ అధ్యక్షత వహించనున్నారు. లోక్సభ, రాజ్యసభలలోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన చర్చలు జరపనున్నారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా, ఫలప్రదంగా సాగేందుకు అన్ని పార్టీల మధ్య సమన్వయం, సహకారం కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
Read also: Garima Agrawal: సిరిసిల్లలో దివ్యాంగుల మహోత్సవం
శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను చర్చకు, ఆమోదానికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అణుశక్తి బిల్లు – 2025, ఇన్సూరెన్స్ (Parliament Winter Session) చట్టాల సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు – 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు వంటి ముఖ్యమైన చట్టసవరణలు అజెండాలో ఉన్నాయి.
మొత్తం 19 రోజుల వ్యవధిలో 15 సమావేశాలు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: