ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు జరిగే మినీ వేలంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఏ ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు? ఎవరు ఎవరిని తీసుకుంటారు? అని, క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. మాజీ కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డూప్లెసిస్ (Faf du Plessis) ఈ సారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
Read Also: Sultan Azlan Shah Cup: ఫైనల్ చేరిన భారత హాకీ జట్టు
సుదీర్ఘకాలం ఐపీఎల్ ఆడానని.. ఈసారి కొత్తగా మరో టీ20 లీగ్‌లో ఆడాలని ఆశపడుతున్నాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడీ సఫారీ మాజీ సారథి. ఈ విషయాన్ని శనివారం స్వయంగా పంచుకున్న డూప్లెసిస్ (Faf du Plessis) కారణం ఏం చెప్పాడంటే..?సుదీర్ఘకాలం ఐపీఎల్ ఆడానని.. ఈసారి కొత్తగా మరో టీ20 లీగ్‌లో ఆడాలని ఆశపడుతున్నాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడీ సఫారీ మాజీ సారథి. ఈ విషయాన్ని శనివారం స్వయంగా పంచుకున్న డూప్లెసిస్ కారణం ఏం చెప్పాడంటే..?
‘పద్నాలుగేళ్లు ఐపీఎల్ ఆడాను. ఈసారి మాత్రం వేలంలో పేరు రిజిష్టర్ చేసుకోవడం లేదు. ఐపీఎల్ వంటి లీగ్‌లో ఆడకూడదనుకోవడం చాలా పెద్ద నిర్ణయం. నా క్రికెటింగ్ కెరీర్లో ఈ లీగ్ పాత్ర మరువలేనది. వరల్డ్ క్లాస్ఆటగాళ్లైన సహచరులతో ఆడడం, అద్భుతమైన ఫ్రాంచైజీలతో కొనసాగడం, క్రికెట్‌ను ఎంతో ప్రేమించే అభిమానుల ముందు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. భారతదేశం నాకు చాలామంది స్నేహితులను ఇచ్చింది.
కొత్త సవాల్
ఎన్నో జీవిత పాఠాలను, మధుర జ్ఞాపకాలను నాకు మిగిల్చింది. అంతేకాదు క్రికెటర్‌గా, వ్యక్తిగా నన్ను ఎంతో మార్చింది.ఈ ప్రయాణంలో నాకు అన్నివిధాలా మద్దతు పలికిన కోచ్‌లు, సహచులు, సహాయక సిబ్బంది.. ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు. నా హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానముంది. అలాఅనీ ఐపీఎల్ (IPL) కు నేను మొత్తానికి గుడ్ బై చెప్పడం లేదు.
మరోసారి నన్ను మీరు ఐపీఎల్‌లో చూస్తారు. అయితే.. ఈసారి మాత్రం కొత్త సవాల్ స్వీకరించాలనుకుంటున్నా. అందుకే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నా’ అని డూప్లెసిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: