మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ (Sultan Azlan Shah Cup) లో భారత హాకీ జట్టు విశేష ప్రదర్శనతో ఫైనల్‌లోకి చేరింది. లీగ్ దశ నుంచి గోల్స్ వర్షంతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వచ్చిన టీమిండియా కెనడా (Canada)ను భారీ తేడాతో చిత్తు చేసింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో డిఫెండర్లు, ఫార్వర్డ్స్ సమిష్టిగా రాణించగా 14-3తో ప్రత్యర్థిని ఓడించి రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
Read Also: KL Rahul: ODI సిరీస్ గెలవడంపై దృష్టి పెడతాం:రాహుల్

సెమీఫైనల్లో
ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీ కోసం ఆదివారం బెల్జియంతో తలపడనుంది. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో (Sultan Azlan Shah Cup) భారత జట్టు 14-3తో కెనడాను చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నీలకంఠ శర్మ గోల్ అందించాడు. కాసేపటికే రాజేందర్ సింగ్ గోల్ సాధించాడు.
2-0తో టీమిండియా ఆధిక్యంలో ఉండగా.. 11వ నిమిషంలో కెనడా ప్లేయర్ బ్రెండన్ గురాలిక్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. ప్రత్యర్థికి షాకిస్తూ ఫార్వర్డ్ ఆటగాళ్లు జుగురాజ్ సింగ్, అమిత్ రోహిదాస్‌లు తలొక గోల్ చేయగా తొలి అర్ధభాగంలో భారత్ 4-1తో ఆధిక్యం కనబరిచింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: