వరంగల్‌లో పర్యటించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (TG) మేడారం సమ్మక్క–సారక్క జాతరపై ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ పండుగకైనా లేదా జాతరకైనా జాతీయ హోదా అనేది ఇచ్చే వ్యవస్థ లేదని స్పష్టం చేశారు. మేడారం జాతర కూడా అదే పరిధిలోకి వస్తుందని తెలిపారు. అయితే ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తామని, జాతర నిర్వహణలో భాగస్వామ్యమవుతామని హామీ ఇచ్చారు.
Read also: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటే అన్న సజ్జనార్

జాతర నిర్వహణకు కేంద్రం నిధుల హామీ
తెలంగాణ(TG) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గతంలో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిమాండ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ దేశంలో ఇప్పటివరకు ఏ వేడుకకూ జాతీయ స్థాయి హోదా ఇవ్వలేదని, అందువల్ల మేడారానికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్రం కోరుకుంటే పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల పెంపు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సమ్మక్క–సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రతీ రెండేళ్లకోసారి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరకు కేంద్రం ఎప్పటికప్పుడు ఆర్థిక సహకారాన్ని అందించిందని చెప్పారు. జాతర రవాణా సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు–వసతి వంటి అవసరాలకు కేంద్ర నిధులు ఉపయోగపడతాయని వివరించారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: