
గోవాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక (IFFI 2025) జరుగుతోంది. భారత సినిమా ప్రపంచానికి చిరస్మరణీయమైన పేరు, కోట్లాది అభిమానుల మనసుల్లో దేవుడిగా నిలిచిన సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గారికి ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును పలువురు ప్రముఖులు కలిసి రజినీకాంత్ గారికి అందజేశారు.
Read Also: Sunil Shetty: మహిళా క్రికెటర్ జెమీమా పై సునీల్ శెట్టి ప్రశంసలు
100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా
అవార్డు అందుకున్న తర్వాత రజినీకాంత్ గారు భావోద్వేగంతో మాట్లాడారు. “నాకు నటన అంటే, సినిమాలు అంటే ఎంతో ప్రేమ. నాకు 100 జన్మలు వచ్చినా, మళ్లీ మళ్లీ రజినీకాంత్ (Rajinikanth) గానే జన్మించాలని కోరుకుంటాను. ఈ అవార్డు నా ఒక్కరికి కాకుండా మొత్తం సినిమా ప్రపంచానికి చెందింది. నన్ను నిలబెట్టిన దేవుళ్లు అంటే నా అభిమానులే.”
అని చెప్పారు.గోవా వేదికపై నిలబడి, రజినీకాంత్ గారు తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. “ఇది ముగింపు కాదు… ఇది ఒక కొత్త మొదలు మాత్రమే!” అని ఆయన తన ప్రత్యేక చిరునవ్వుతో ముగించారు. ఆ మాటలు వినగానే హాల్‌లో కూర్చున్న అందరికి ఉత్సాహం వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: