తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservation) అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని ఆయన హెచ్చరించారు.
Read Also: AP Crime: హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తులతో దాడి

నిరసన ప్రదర్శన, ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు
శుక్రవారం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ(BC Reservation) జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువజన, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్. కృష్ణయ్య(R.Krishnaiah) నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 42 శాతం రిజర్వేషన్లపై ప్రతి దశలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జీఓ 46ను తీసుకొచ్చి ప్రభుత్వం బీసీలను దగా చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు తాము దశలవారీగా పోరాటం చేస్తామని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు:
- ప్రధాని మోదీతో భేటీ: రానున్న పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేలా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని తెలిపారు.
- భారీ బహిరంగ సభ: బీసీ రిజర్వేషన్లపై త్వరలో పరేడ్‌మైదానంలో లక్షలాది మందితో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించి కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని చెప్పారు.
- జంతర్ మంతర్ ధర్నా: అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ సహా పలువురు బీసీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: