తిరుమలలో భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనా(Tirumala Vaikunta Dwaram)ల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈసారి టీటీడీ ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందిస్తూ, భక్తులకు ముందుగానే ఆన్లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు 18.9 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది.
ట్రస్టీ కీలక నిర్ణయ ప్రకారం, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరికి లక్కీ డ్రా విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించబడతాయి.
Read Also: Srisailam: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.27 కోట్లు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం భక్తులు
జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం(Tirumala Vaikunta Dwaram) క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా సర్వ దర్శనం నిర్వహించబడుతుంది. ఈ రోజుల్లో భక్తులు టోకెన్ల లేకుండా క్యూలైన్‌లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం భక్తులు TTD Dashboard ద్వారా నమోదు చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నమోదు చేసుకోవచ్చు. టోకెన్ ఎంపిక అయిన భక్తులకు దర్శన సమాచారం డిసెంబర్ 2న పంపబడుతుంది.
వైకుంఠ ద్వార దర్శనం
WhatsApp చాట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు 9552300009కి “Hi” లేదా “Govinda” మెసేజ్ పంపాలి, తరువాత భాషను ఎంపిక చేసుకుని, TTD Temple విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత వైకుంఠ ద్వార దర్శనం (e-Dip) రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ప్రతి మొబైల్ నంబర్, ఆధార్ కార్డు ద్వారా ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 8 వరకు రోజువారీగా 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ.300) మరియు 1,000 శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించబడతాయి. స్థానికులకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతానికి ప్రత్యేకంగా టోకెన్లు విడుదల చేయబడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: