భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన కెరీర్‌లోనే ఓ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన తర్వాత హిట్ మ్యాన్ వన్డే క్రికెట్‌పై దృష్టిసారించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (ICC ODI World Cup) ఆడాలనే సంకల్పంతో బరువు కూడా తగ్గిన హిట్ మ్యాన్ అత్యంత ఎక్కువ వయస్సులో వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అలాంటి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు అత్యంత సమీపంలో ఉన్నాడు.
Read Also: Ayush Mhatre:రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కేవలం 98 పరుగుల దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి రాంచీలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ (Rohit Sharma) ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

నాలుగో భారత బ్యాటర్‌గా
రోహిత్ శర్మ (Rohit Sharma) ఇప్పటి వరకు టీ20, టెస్టు, వన్డేల్లో కలుపుకొని 502 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4,301 పరుగులు మాత్రమే చేసిన హిట్ మ్యాన్, టీ20ల్లో 4,231 రన్స్ సాధించాడు. వన్డేల్లో అత్యధికంగా 11,370 పరుగులతో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో 98 పరుగులు చేసి 20 వేల మార్క్‌ను అందుకోవాలని చూస్తున్నాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
రోహిత్ శర్మ దేశీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడాడు?
రోహిత్ శర్మ 2005లో ముంబై తరఫున లిస్ట్–ఏ మ్యాచ్ ఆడి దేశీయ స్థాయిలో అరంగేట్రం చేశాడు.
భారత జట్టులోకి రోహిత్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడు?
అతను 2007లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత సీనియర్ జట్టులోకి ప్రవేశించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: